Farmers do not resort to middlemen, we Buy every grain of grain Joint Collector GC Kishore Kumar, JC inspected farmer assurance centers
Publish Date : 06/01/2022
రైతులు దళారులను ఆశ్రయించవద్దు
ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం
జాయింట్ కలెక్టర్ జిసి కిశోర్ కుమార్
రైతు భరోసా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ
విజయనగరం, జనవరి 05:
ధాన్యం కొనుగోలు కోసం రైతులు దళారులను ఆశ్రయించవద్దని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్ కోరారు. లక్ష్యాల మేరకు ప్రతీ ద్గన్యపు గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన జరిపారు.
బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడి తేమ శాతం, ఇతర అంశాలను తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియంపై ఆరా తీసారు. వారి సమస్యలపై ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోలు ప్రక్రియపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు.
రామభద్రపురం మండలం తారాపురం గ్రామంలో ధాన్యం తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ గ్రామంనుంచి సుమారు 25 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, 3 లారీలతో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. దీనిపట్ల రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, ఆయా మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
