Close

For the safety of women and children traveling in autos, shelters are useful, said District Collector Mrs. A. Suryakumari.

Publish Date : 28/09/2022

ఆటోలలో ప్రయాణించే మహిళలు, బాలలకు భద్రత కోసం అభయం

నిరక్షరాశ్యులకు ఉపయోగకరం

                  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి

విజయనగరం,  సెప్టెంబర్ 26; ఆటోలలో ప్రయాణించే  మహిళలు, బాలల  భద్రత కోసం  అభయ యాప్ ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు.  ఆటోకు అమర్చిన ఈ మీటర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకుల కోసం రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కార్యక్రమం అభయం అని, ఈ యాప్ ను ప్రతి మహిళా తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. దిశ వంటి దిశ వంటి ఈ యాప్  మహిళా ప్రయాణీకుల భద్రత కోసం అభయం ప్రభుత్వం రుపొందించిన మరో రక్షణ కవచం ఆవుతుందని పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 వేల ఆటోల్లో ఈ అభయం అనే పరికరం ద్వారా మహిళా ప్రయాణీకులకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మహిళా ప్రయాణీకులు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటో దారి మల్లించినపుడు, తమ భద్రతకు ముప్పు వాటిల్లిందని భావించినపుడు ఈ పరికరం బటన్ ప్రెస్ చేస్తే పోలీసులకు, సంబంధిత వర్గాలకు ఈ సమాచారం చేరి వారు అలెర్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  కలిగిన ట్రాకింగ్ పరికరాన్ని ఆటోలులో అమర్చడమే కాకుండా వాహనానికి  క్యు అర్ కోడ్ అమర్చడం జరుగుతుందన్నారు.

పని చేయు విధానం:

 స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రయాణీకులు ప్లే స్టోర్ ద్వారా అభయం మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని, తన మొబైల్ నెంబర్ తో నమోదు చేసుకోవాలి.  ప్రయాణానికి బయలుదేరే ముందు వాహనం పై ఉన్న క్యు ఆర్ కోడ్  ను స్కాన్ చేసినా లేదా వాహనం నెంబర్ ను నమోదు చేసిన వెంటనే డ్రైవర్ యొక్క వివరాలు తెలుస్తాయి.  వచ్చిన డ్రైవర్ వివరాలు, వాహనం యొక్క డ్రైవర్ ఒక్కరే అని  నిర్థారించుకోన్నాక గమ్య స్థానం నమోదు చేయాలి. ట్రిప్ వివరాలను లేదా ప్రస్తుత లొకేషన్ ను సంరక్షకుని తో షేర్ చేయాలి. ప్రయనీకునికి 3 రూట్ లు కనపడతాయి, ఈ రూట్ లు జియో ఫెన్స్ చేయబడి ట్రాకింగ్ జరుగుతుంది.  నమోదు చేసిన రూట్ కాకుండా వేరే రూట్ కు వెళ్ళినా లేదా డ్రైవర్ చెడు ప్రవర్తన గుర్తించినా వెంటనే డ్రైవర్ వెనుక అమర్చిన పరికరం లోని పానిక్ బటన్ నొక్కాలి. వెంటనే సిగ్నల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్తుంది. అక్కడి నుండి పోలీస్ వారికి ఆదేశాలు జారీ అవుతాయి.

 మహిళలంతా ఈ పరికరంపై అవగాహన పెంచుకోవడంతో పాటు తోటి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యంత్రం ద్వారా  స్మార్ట్ ఫోన్ లేకపోయినా, అక్షరాస్యత లేకపోయినా మీటర్ నొక్కితే చాలు రక్షణ కలుగుతుందన్నారు. ప్రతి మహిళా దీని పై అవగాహన కలిగి ఉండేలా అధికారులు చైతన్యం చేయాలన్నారు.    ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి డా.వి.సుందర్ , వాహన తనిఖీ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

For the safety of women and children traveling in autos, shelters are useful, said District Collector Mrs. A. Suryakumari.