Close

* Honors for Best Volunteers * Prepared Ayodhya Ground * Service Awards for a total of 9,659 people from the District * JC Mayur Ashok oversees the arrangements

Publish Date : 07/04/2022

* ఉత్తమ వాలంటీర్లకు సన్మానం
*సిద్ధమైన అయోధ్య మైదానం
* జిల్లానుండి మొత్తం 9,659 మందికి సేవా పురస్కారాలు
* ఏర్పాట్లను పరిశీలించిన జే.సి మయూర్ అశోక్
విజయనగరం, ఏప్రిల్ 07 ; గ్రామ స్వరాజ్యానికి ఊపిరి పోసేలా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ను ఆవిష్కరించింది. ప్రభుత్వ ఆశయానికి వారధి గా నిలుస్తు వాలంటీర్లు వెల కట్టలేని సేవలను అందిస్తూ ప్రతి ఇంటిలో ఒక సభ్యునిలా మారిపోయారు. గ్రామాల్లో ప్రతి అవ్వా, తాత వాలంటీర్ కోసం ఎదురు చుసేవారే. ప్రభుత్వం ఏ పధకం ప్రకటించినా వాలంటీర్ నుండే లబ్ది దారుల గుర్తింపు మొదలవుతుంది. పధకాల పై అవగాహన కలిగించడం, ప్రజలతో మమేకం కావడం తో గ్రామాల్లో వాలంటీర్లకు గుర్తింపు, గౌరవం లభిస్తోంది. అటువంటి సేవలనందిస్తున్న వార్డ్, గ్రామ వాలంటీర్లకు ఏడాది లో ఒకసారి సత్కరించి రాష్ట్ర వ్యాప్తంగా పండగ లా ఉత్సవాన్ని చేస్తోంది ప్రభుత్వం. ఉత్తమ సేవలను అందిస్తున్న వారిని సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అనే మూడు విభాగాలుగా గుర్తించి 10 వేలు, 20 వేలు, 30 వేల రూపాయల చొప్పున నగదు పురస్కారం తో పాటు సర్టిఫికేట్ , ఒక మెడల్ బహుకరించి శాలువాలతో సన్మానం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. పించన్ల పంపిణీ, బయో మెట్రిక్ హాజరు, సర్వే , స్పందన కార్యక్రమాలలో ఉత్తమంగా నిలిచిన వారిని పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది.
జిల్లాలో సేవా మిత్ర అవార్డు కోసం 9464మందిని, సేవా రత్న కోసం 160 మందిని, సేవా వజ్రా కోసం 35 మందిని మొత్తంగా 9659 మందిని ఎంపిక చేయడం జరిగింది. గురువారం అయోధ్యమైదానం లో సేవా వజ్ర కు ఎంపికైన 35 మందిని, , సేవా రత్న కు ఎంపికైన 160 మందిని ఘనంగా సత్కరించనున్నారు. అందుకోసం చురుకుగా ఏర్పాట్లను జరుపుతున్నారు.
పక్కగా ఏర్పాట్లు: జే.సి. మయూర్ అశోక్
సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ బుధవారం అయోధ్య మైదానం లో జరుగుతున్న ఏర్పాట్లను ఆర్.డి.ఓ భవాని శంకర్ తో కలసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2500 హాజరు కానున్నారని, వీరందరికీ తాగు నీరు, మజ్జిగ ను ఏర్పాటు చేయాలనీ పారిశుధ్య నిర్వహణ చూడాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగం లైవ్ టెలికాస్ట్ కు ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలనీ, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమాలు ప్రారంభం అయ్యే వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని డి.ఈ.ఓ, డి.బి.సి.డబ్ల్యు కు ఆదేశించారు. సత్కారానికి అవసరమగు నగదు, శాలువలు, సర్టిఫికేట్ లు, మెడల్స్ తదితర సామగ్రినంతా సిద్ధం చేసుకోవాలని జిల్లా పరిషత్ సి.ఈ.ఓ కు సూచించారు. ఉదయం 10 గంటల నుండి జరుగు ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొంటారని, అధికారులంతా సమన్వయం తో పని చేసి కార్యక్రమాన్ని జయప్రదం గావించాలని అన్నారు.

* Honors for Best Volunteers * Prepared Ayodhya Ground * Service Awards for a total of 9,659 people from the District * JC Mayur Ashok oversees the arrangements