Close

In-charge Collector Mayur Ashok directed the officials to organize the celebrations grandly to highlight the uniqueness of this year’s Azadi Ka Amrit Mahotsavam in Independence Day celebrations.

Publish Date : 06/08/2022

 ఘనంగా  ఆజాది కా అమృత్ ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అభివృద్ధి  సంక్షేమ పథకాల పై  ఫోటో ప్రదర్శన

 ఆకర్షణీయంగా శకటాల ప్రదర్శన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల  పై సమీక్షించిన  ఇంచార్జ్ కలెక్టర్  మయూర్

విజయనగరం, ఆగస్ట్ 05:  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  ఈ ఏడాది ఆజాది కా అమృత్ మహోత్సవమ్ ప్రత్యేకతను చాటేలా వేడుకలను  ఘనంగా నిర్వహించాలని ఇంచార్జ్ కలెక్టర్ మయూర్  అశోక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని  చాటేలా శకటాల ప్రదర్శన, ఫోటో ప్రదర్శన ఏర్పాటు  చేయాలని  సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సమీక్షించారు.

      దేశమంతటా ఈ ఏడాది  ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున అందుకు తగ్గట్టుగా వినూత్నంగా ఆలోచించి ప్రదర్శనలు చేయాలన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవమ్ లోగో ను తప్పనిసరిగా శకటాల పై, ఫోటో ప్రదర్శన లో వినియోగించాలన్నారు. అధికారులే స్వయంగా  హాజరై వైవిధ్యంగా శకటాలు ఉండేలా చూడాలన్నారు. పథకాలన్నీ స్పష్ట0గా  చూడగానే అర్ధం అయ్యేలా ఉండాలన్నారు.

        జిల్లా పౌర సరఫరాల, అటవీ శాఖ, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పరిశ్రమల శాఖలు శకటా ల ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు.

         జిల్లా   పంచాయతి అధికారి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ, డ్వామా, డి.ఆర్.డి.ఏ, సమగ్ర శిక్ష, మత్స్య శాఖ, ఉద్యాన శాఖ, సర్వే, చేనేత జౌళి, సెట్విస్, స్కిల్ డెవలప్మెంట్, వై.ఎస్.ఆర్.ఆరోగ్య శ్రీ శాఖల ద్వారా ప్రత్యేక స్టాల్ల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.

       ఎన్.ఐ.సి ద్వారా వేడుకలను యూ ట్యూబ్ నందు లైవ్ టెలికాస్ట్ గావించాలన్నారు.  విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.  జనరేటర్ ను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు.

ఈ సమావేశం లో డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ సూర్యకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

In-charge Collector Mayur Ashok directed the officials to organize the celebrations grandly to highlight the uniqueness of this year's Azadi Ka Amrit Mahotsavam in Independence Day celebrations.