Joint Collector Mayur Ashok inspected the ration shop
Publish Date : 18/05/2022
రేషన్ షాప్ ని తనిఖీ చేసిన జెసి మయూర్ అశోక్
భోగాపురం మండలం సవరవిల్లి రేషన్ షాపు ను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ సరుకుల నాణ్యతను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. సరుకుల సరఫరాపై ఆరా తీశారు. డిపోలో విద్యుత్ సరఫరా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో మండల తాసిల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
