Close

Lakhs of metric tonnes of fortified rice should be given and bank guarantee should be submitted immediately, Joint Collector GC Kishore Kumar

Publish Date : 29/12/2021

1.30 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి
వెంటనే బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి
జాయింట్ కలెక్టర్ జిసి కిశోర్ కుమార్
విజయనగరం, డిసెంబర్24 :
    ఈ ఏడాది సుమారు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల సార్ట్ క్స్ ఫోర్టిఫైడ్ రైస్ సేకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ చెప్పారు. పౌర సరఫరాలు, రైస్ మిల్లర్స్ తో తన ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం సేకరణ, బ్యాంకు గేరంటీలపై సమీక్ష చేశారు. మిల్లర్లు వెంటనే బిజీలు సమర్పించి, ధాన్యం తీసుకొని మర మొదలు పెట్టాలని ఆదేశించారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు. పోర్టిఫైడ్ బియ్యం మినహా, మిగిలిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు పంపిస్తామని జేసీ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సరఫరా అధికారి పాపారావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవుల్ నాయక్, ఏజిఎం కె. మీనా కుమారి, మిల్లర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Lakhs of metric tonnes of fortified rice should be given and bank guarantee should be submitted immediately, Joint Collector GC Kishore Kumar