Last date for recruitment of contract jobs in model schools, application deadline is 17th August
Publish Date : 12/08/2022
మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ
దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 17
విజయనగరం, ఆగస్టు 11 ఃమోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసేందుకు పిజిటి, టిజిటి పోస్టులను భర్తీ చేయడానికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, జిల్లా విద్యాశాఖాధికారి (ఇన్‌ఛార్జి) కె.వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లు కలిపి టిజిటి-71, పిజిటి-211, మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్లో మొదలయ్యిందని, ఈ నెల 17వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23న అభ్యర్థుల ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారని, 25వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని తెలిపారు. 29వ తేదీన ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను 1:2 నిష్పత్తిలో ప్రకటించడం జరుగుతుందని, 30, సెప్టెంబరు 1 తేదీల్లో అభ్యర్థులకు టీచింగ్‌లో డెమో, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. సెప్టెంబరు 5న తుది జాబితాను ప్రకటించి, 8వ తేదీన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టులను కేటాయిస్తారని, 9వ తేదీన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని డిఇఓ వివరించారు. వివరాలకు https//nadunedu.se.ap.gov.in/STMSWorks/Application/Guest_Registration.aspx వెబ్‌సైట్‌లో ఇతర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.