Close

Let’s pave the way for development with collective efforts, the fruits of freedom should be shared equally, Azadi Ka Amrit Mahotsava is celebrated throughout the district, Happy Independence Day to all the people, District Collector Surya Kumari

Publish Date : 24/08/2022

 సమష్టి కృషి తో అభివృద్ధికి బాటలు వేద్దాం

 స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందాలి

జిల్లా అంతటా  ఘనంగా  ఆజాది క అమృత్ మహోత్సవాలు

ప్రజలందరికీ స్వాంతత్య్ర  వజ్రోత్సవ  శుభాకాంక్షలు

జిల్లా  కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, ఆగస్ట్ 14::   అన్ని వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందించి, సమష్టి కృషి తో జిల్లా అభివృద్ధికి పాటు పడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆకాంక్షించారు.  ప్రజలంతా స్వేచ్ఛ, సమనత్వాలను పొందుతూ  అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆర్ధిక సాధికారతను సాధించాలన్నారు.  75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కలెక్టర్ ఆదివారం  ఒక ప్రకటన ద్వారా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.    కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల పిలుపు నందుకొని   హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి  జిల్లా అంతటా మువ్వన్నెల జెండాలను చేత పట్టి పలు రకాల కార్యక్రమాలతో , సంబరాల తో  ప్రజలంతా తమ దేశ భక్తిని చాటుకున్నారని అభినందించారు. ఎన్నడూ లేని విధంగా ఈ స్వాతంత్ర్య వేడుకలు ప్రజలలో  ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపాయని, చదువు లేని వారు  సైతం  ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో స్వచ్చందంగా  పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అనేక సూచీలలో ముందున్నామని, అందుకు  కృషి చేసిన అధికారులకు సహకరించిన  ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. విద్య , వైద్య ఆరోగ్యం, మహిళా సాధికారత తదితర రంగాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని,  మరింత చేరువుగా ప్రజలకు  ఈ సేవలను అందించడం ద్వారా  ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్య0గా  ఆర్ధిక స్వావలంబన జరిగితేనే నిజమైన అభివృద్ధి గా భావించి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేయడం జరిగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి కృషి జరుగుతోందని అన్నారు.  రైతుకు ఎక్కువ ఆదాయం సమకూర్చే ప్రయత్నంలో వాణిజ్య పంటల సాగు ను ప్రోత్సహించడం జరుగుతోందని, అదే విధంగా పంటల మార్పిడి పై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయని,  స్వయం ఉపాధి సాధించే దిశగా మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లా నుండి  స్వాతంత్రోద్యమం తో సంబంధం ఉన్న జిల్లాకు చెందిన సమరయోధులు బంధువులను  ఘనంగా సత్కరించుకున్నామని, క్రీడలలో, సేవలతో, ఇతర రంగాలలో ప్రఖ్యాతంగా నిలిచిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సత్కరించుకోవడం జరిగుతుందని అన్నారు. పోలీస్ పేరడ్ గ్రౌండ్ లో  15 న ఉదయం 9 గంటల నుండి స్వాతంత్ర్య  వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం గావించాలని కోరారు.

Let's pave the way for development with collective efforts, the fruits of freedom should be shared equally, Azadi Ka Amrit Mahotsava is celebrated throughout the district, Happy Independence Day to all the people, District Collector Surya Kumari