Close

Malnutrition in children should be prevented, says Collector Surya Kumari at Nithiyogi meeting

Publish Date : 10/12/2021

పిల్ల‌ల్లో పోష‌కాహార లోపాన్ని నివారించాలి

నీతిఅయోగ్ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 09 ః         పిల్ల‌ల్లో పోష‌కాహార లోపాన్ని నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ అంశాల‌పై త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం, పోష‌కాహార లోపం నివార‌ణ‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఆయా అంశాల్లో జిల్లా ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. జిల్లాలో ఆరేళ్ల లోపు పిల్ల‌లు సుమారు 1,18,726 మంది రిజిష్ట‌ర్ కాగా, వీరిలో సుమారు 2.15 శాతం మంది పోష‌కాహార లోపంతో, 1.7 శాతం మంది తీవ్ర పోష‌కాహార లోపంతో ఉన్న‌ట్లు గుర్తించి, లోపాన్ని నివారించేందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. ఆసుప‌త్రి ప్ర‌స‌వాలు, స్త్రీపురుష నిష్ప‌త్తి ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అన్ని ప్ర‌స‌వాలు ఆసుప‌త్రిలోనే జ‌రిగేలా చూడాల‌ని, ఇమ్యూనైజేష‌న్ శ‌త‌శాతం జ‌ర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
ఈ స‌మావేశంలో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి జె.విజ‌య‌లక్ష్మి, డిఎంఅండ్‌హెచ్ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, జిల్లా టిబి అధికారి డాక్ట‌ర్ రామేశ్వ‌రి, డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Malnutrition in children should be prevented, says Collector Surya Kumari at Nithiyogi meeting