Close

Measures for payment of arrears of farmers, reviewed by the Collector on NCS Sugars

Publish Date : 03/11/2021

రైతుల బకాయిల చెల్లింపునకు  చర్యలు

   ఎన్.సి.ఎస్  సుగర్స్ పై సమీక్షించిన కలెక్టర్

విజయనగరం, నవంబర్ ౦2:   ఎన్.సి.ఎస్ చెక్కర కర్మాగారానికి   కి సంబంధించిన రైతుల బకాయిలను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  మంగళవారం తన ఛాంబర్ లో  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ , సబ్ కలెక్టర్ భావన  తో కలసి  బకాయిల చెల్లింపుల పై సమావేశం ఏర్పాటు చేసారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019-20, 2020-21  రెండు సీజన్ల క్రషింగ్  కు సంబంధించి   16కోట్ల 33 లక్షల  రూపాయలను,  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్  డ్యూటీ  బకాయిలు 87.50 లక్షలు, ఈ.పి.ఎఫ్ బకాయిలు 3 కోట్ల 41 లక్షలు, జి.ఎస్.టి బకాయిలు 3.36 కోట్ల రూపాయలను   ఆర్ ఆర్ ఆక్ట్ ని అమలు చేస్తూ మొత్తం 23.98 కోట్ల  బకాయిలను చెల్లించాలని అన్నారు. ఆ మేరకు ఇద్దరు తాసిల్దార్లకు  ఆదేశాలు  జారి చేసారు.   ఈ బకాయిలను తీర్చడానికి గాను   బొబ్బిలి లో 14.67 సెంట్లు, సీతానగరం లో 5.23 సెంట్లు ఆస్తుల జప్తుకు నోటీసు లు జారి చేసి వేలం వేయాలని సూచించారు.  అందుకు అవసరమగు నిబంధనలన్నిటిని పాటిస్తూ బకాయిల చెల్లిం పూలకు అవసరమగు  చర్యలను వెంటనే చేపట్టాలన్నారు.

       ఈ సమావేశం లో సీతానగరం, బొబ్బిలి తహసిల్దార్లు అప్పల రాజు, రామ స్వామి , బొబ్బిలి  చెక్కర కర్మాగారం సహాయ కమీషనర్ లోకేస్వర రావు, కలెక్టరేట్ పరి పాలనా అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Measures for payment of arrears of farmers, reviewed by the Collector on NCS Sugars