Measures on high grain mills, move by tractors if gunny bags do not fit, Collector who inspected Kondavelagada, Parashan RBK
Publish Date : 05/01/2022
ఎక్కువ ధాన్యం తూసే మిల్లుల పై చర్యలు
గన్నీ సంచులు సరిపడక పోతే ట్రాక్టర్ల ద్వారా తరలించండి
కొండవెలగాడ, పారశాం ఆర్.బి.కే లను తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం, జనవరి 05: రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ , ఎక్కువగా తూసే మిల్లుల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి హెచ్చరించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, పారశాం రైతు భరోసా కేంద్రాలను బుధవారం కలెక్టర్ ఆకష్మిక తనిఖీ చేసారు. కొండవెలగాడ లో కళ్ళం లో తూకానికి సిద్ధంగా నున్న బస్తాలను పరిశీలించారు. తేమ శాతం, తూకం, గన్నీల అందుబాటు, ఏ రకం పండించారు., ఎంత దిగుబడి వచ్చిందని రైతులతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. తేమ శాతం 12 నుండి 13 వరకు వచ్చిందని, ఈ రోజు 10 మందికి టోకెన్లు జారి చేసారని, గన్నీ లు కూడా అందుబాటు లో ఉన్నాయని, జరజపు పేట మిల్లుకు తరలిస్తున్నామని రైతులు తెలిపారు. 1121 రకం వేశామని, ఎకరాకు 20 బస్తాల పై బడి దిగుబడి వచ్చిందని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టాలని, తక్కువ ఖర్చు తో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని, నేల కూడా సారవంతంగా ఉంటుందని, ఆరోగ్యకరమని తెలిపారు. 10 మంది రైతులు కలసి వస్తే శిక్షణ ఇప్పిస్తామని, అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామని రైతులకు తెలిపారు.
పారశాం రైతు భరోసా కేంద్రం లో రైతులతో మాట్లాడారు. గన్నీ సంచులు సరిపడవని రైతులు చెప్పగా స్వంత గన్నీలు వాడండి లేదా ట్రాక్టర్ల పై నైనా జాగ్రత్తగా తరలించండి అని కలెక్టర్ తెలిపారు. మిల్లు వద్ద తేమ యంత్రాలు వద్దని, రైతు భరోసా కేంద్రాల్లోనే తేమ తనిఖీ జరగాలని అన్నారు. జరజపుపేట మిల్లు వద్ద ఎక్కువగా తూస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టి కి తీసుకురాగా, అక్కడే ఉన్న ఆర్.ఐ ను పిలిచి వెంటనే తనిఖీ చేసి సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కువగా తూస్తున్నట్లు నిర్ధారణ జరిగితే మిల్లును మూసివేస్తామని అన్నారు.
అక్కడే ఉన్న వాలంటీర్ల తో మాట్లాడుతూ వాక్సినేషన్ 15 పై బడిన వారికీ ఎంతవరకు జరిగిందని ఆరా తీసారు. 18 పై బడిన వారందరకి పూర్తి అయ్యిందని, పెండింగ్ లేదని, 15 పైబడిన వారికీ వేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ జి. నారాయణ రావు, వాలంటీర్ లు, , వ్యవసాయ శాఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
