Close

Millers should not do work that harms the farmer, should immediately collect gunny bags from ration dealers, tehsildars should oversee the grain procurement process themselves, Civil Supplies Commissioner Girija Shankar

Publish Date : 05/01/2022

రైతుకు నష్టం చేసే పని మిల్లర్లు చేయవద్దు

రేషన్ డీలర్ల నుండి  వెంటనే గన్నీ సంచులను సేకరించాలి

తహసిల్దార్లు  ధాన్యం సేకరణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలి

                                                                                                                         పౌర సరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్

విజయనగరం, జనవరి 04:   రైతు లేకపోతే మిల్లర్ల వ్యాపారం ఉందని, దీనిని దృష్టి లో పెట్టుకొని   మిల్లర్లు  రైతుకు నష్టం జరిగే పని చేయవద్దని పౌర సరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మిల్లర్లకు సూచించారు.  కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తో కలసి కమీషనర్ మిల్లర్లతో, అధికారులతో ధాన్యం సేకరణ పై సమీక్షించారు.  ముందుగా మిల్లర్ల సమస్యలు వినిపించారు.  వాటి పై కమీషనర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 145 మిల్లర్లు బి.జి లు ఇచ్చారని,  ఆయితే తక్కువగా ఇచ్చారని, దీనిని పెంచవలసిన అవసరం ఉందని కోరారు. ఇప్పటికే బి.జి లు ఇచ్చిన వారంతా 24 గంటల్లో అగ్రిమెంట్ మీద సంతకాలు చేయాలన్నారు.  తేమ యంత్రాల్లో సాంకేతిక సమస్యల వలన  రైతుకు మిల్లర్ల నుండి నష్టం జరుగుతుందని, అలాంటి  చర్యలను సహించబోమని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న తేమ యంత్రాలనే  పరీక్షకు వినియోగించాలని సూచించారు. బయట రాష్ట్రాల నుండి  జిల్లాకు ధాన్యం తీసుకోవద్దని అన్నారు.   మిల్లు వారీగా అందుబాటు లో ఉన్న గన్నీ సంచుల వివరాలను అందజేయాలని ఆదేశించారు.

రేషన్ డీలర్ల నుండి  వెంటనే గన్నీ సంచులను సేకరించాలి:

     అధికారులతో  మాట్లాడుతూ  రేషన్ డీలర్ల నుండి గోనె సంచులను వెంటనే సేకరించాలని ఆదేశించారు. మిల్లు వారీగా ఎంత స్టాక్ ఉందొ తనిఖీ చేసి  నివేదిక ఇవ్వాలన్నారు.  జిల్లాలో రేషన్ దుకాణాల్లో 24 లక్షల గన్నీలు  ఉన్నాయని, వాటిని వెంటనే తీసుకొని మిల్లులకు కేటాయించాలని అన్నారు.  ప్రతి రోజు సాయంత్రానికి గన్నీ సంచుల , సేకరణ వివరాలు,  సి.ఎం.ఆర్  వివరాలు, మిల్లు వారీగా ఆర్.బి.కే వారీగా నివేదిక   ఇవ్వాలన్నారు.  తఃసిల్దార్లు, సి.ఎస్.డి.టి లేదా ఆర్.ఐ  వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని ఆర్.బి.కే ల్లో స్టాఫ్ ను పెంచాలన్నారు.  వ్యవసాయ శాఖ అధికారులు ఆర్.బి.కే ల వద్ద రైతులకు తేమ శాతం, చెల్లింపుల వివరాలు, సేకరణ , రవాణా , రంగు మారిన  ధాన్యం తదితర అంశాల పై పూర్తిగా అవగాహన కలిగించాలన్నారు.

  తహసిల్దార్లు  ధాన్యం సేకరణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలి  ::

అనంతరం తహసిల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ   ధాన్యం కొనుగోళ్ళ లో మిల్లర్ల  పాత్ర ను తగ్గించాలని, క్వాలిటీ టెస్టింగ్ ఆర్.బి.కే లలో నిర్వహించాలని తఃసిల్దార్లకు ఆదేశించారు.  శత శాతం ఈ క్రాప్ నమోదు జరగాలని, కళ్ళం లో , పొలం లో కుప్పల వద్దనే తేమ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆర్.బి.కే వారీగా ఎంత పంట పండింది, ఎంత సేకరణ జరిగింది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.  మండల స్థాయి బృందాలు రోజుకు కనీసం 4 ఆర్.బి.కే లను తనిఖీ చేయాలనీ,  వచ్చే 10 రోజులు కీలకమని, పండగ ముందే గరిష్టంగా సేకరణ జరిగాలని ఆదేశించారు.  సేకరించిన వాటికీ 21 రోజులు వరకు చూడకుండా చెల్లింపులు ఎప్పటికప్పుడు జరగాలని అన్నారు.

          జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ మిల్లర్లు ఎక్కువ ధాన్యం తుస్తే వారి పై చర్యలు తప్పవని అన్నారు.  ఫిర్యాదుల కోసం  ప్రతి ఆర్.బి.కే లో టోల్ ఫ్రీ నెంబర్, తహసిల్దార్ నెంబర్ రైతులకు కనపడేలా ఫ్లెక్షి డిస్ప్లే చేయాలన్నారు.  రైతు భరోసా కేంద్రాలన్నీ ఉదయం 7 గంటలకే తెరవాలని ఆదేశించారు.

          ఈ సమావేశం లో జే.సి కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ భవాని శంకర్, డి.ఎస్.ఓ పాపా రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాయక్, డి.సి.ఓ అప్పల నాయుడు,  ఎ.జి.ఎం మీనా కుమారి, మార్కెటింగ్ ఎ.డి శ్యాం కుమార్ , జే.డి. తారక రామా రావు  , ఎల్.డి.ఎం శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Millers should not do work that harms the farmer, should immediately collect gunny bags from ration dealers, tehsildars should oversee the grain procurement process themselves, Civil Supplies Commissioner Girija Shankar