Close

New checklist for secretariat checks, District Collector Surya Kumari

Publish Date : 18/05/2022

👉సచివాలయ తనిఖీలకు కొత్త చెక్ లిస్ట్
👉కౌమార బాలికలకు అవగాహన కోసం సఖి గ్రూప్
👉ప్రసవించేవరకూ గర్భిణీల మానిటరింగ్
👉వేసవి సెలవుల్లో పిల్లలకు రీడింగ్  హెబిట్ కోసం స్టోరీ పుస్తకాలు
👉 జిల్లా కలెక్టరు సూర్య కుమారి
విజయనగరం, మే 17:: మండల ప్రత్యేకధికారులు, జిల్లా అధికారుల  సచివాలయాల తనిఖీలలో పరిశీలించిన అంశాలను నమోదు చేయడానికి కొత్త ఫార్మాట్ ను రూపొందించినట్లు జిల్లా కలెక్టరు సూర్య కుమారి తెలిపారు. ఇక పై నూతన ప్రొఫార్మా లొనే అప్లోడ్ చేయాలని అన్నారు. మంగళవారం మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ టీమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కన్వర్జెన్స్, ఈ-శ్రమ రిజిస్ట్రేషన్, మాతృ మరణాలు, హౌసింగ్, వేసవి సెలవుల్లో బ్రిడ్జి కోర్స్ తదితర అంశాల పై పలు సూచనలు చేశారు.
     సచివాలయ తనిఖీలలో ముఖ్యా0గా అందుబాటులో నున్న ఇన్ఫ్రా, హార్డ్ వేర్ , ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల పై పోస్టర్ల ప్రదర్శన, వెల్ఫేర్ క్యాలెండర్ ప్రదర్శన ఉన్నదీ లేనిదీ తనిఖీ లో రాయలన్నారు.  అదే విధంగా సోషల్ ఆడిట్ లిస్ట్ ప్రదర్శన, డెలివరీ, ఈ సర్వీసెస్, స్పందన డిస్పోసల్స్, యూనిఫామ్ ధరించింది లేనిది నమోదు చేస్తూ ఆ సచివాలయ పరిధిలో ని విజయ గాధలను కూడా నమోదు చేయాలన్నారు.  అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ను అధికారులందరికి పంపడం జరిగిందన్నారు.
    ఐ.ఎం.ఆర్, ఎం.ఎం.ఆర్, సామ్, మామ్,  హై రిస్క్ గర్భిణీ లను గుర్తించడం లో  ఐ.సి.డి.ఎస్, వైద్య ఆరోగ్య శాఖ కన్వర్జెన్స్ మోడ్ లో పని చేయవలసిన అవసరం వుందన్నారు. దీనివలన నివారించదగ్గ వాటిని ముందే నివారించగలమని పేర్కొన్నారు.  కౌమారం లో వివాహాలు, గర్భం దాల్చడం  తల్లులకు, పిల్లలకు, సమాజానికి మంచిది కాదనే విషయాన్ని వారికి అర్ధమయ్యేలా అవగాహన కల్పించాలని, అందుకోసం ప్రత్యేక కౌమార బృందాలను సఖి పేరుతో  ఏర్పాటు చేయాలన్నారు.  ఈ గ్రూప్ లోనున్న టీనేజ్ బాలికలకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణ నిస్తూనే ఎర్లీ మేరేజస్ , టీనేజ్ ప్రేగ్నన్సీ వలన కలిగే నష్టాల పై అవగాహన కలిగించాలన్నారు.  గ్రామాల్లో, పట్టణాల్లో ఇలాంటి వారిని డి.ఆర్.డి.ఏ, మెప్మా ద్వారా గుర్తించాలన్నారు. గ్రామ స్థాయి నుండే సమావేశాలు నిర్వహించాలని,  మహిళా పోలీస్, ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని, అధికారులంతా ప్రజల తో మమేకం అయి పని చేయాలని అన్నారు.
   మాతా, శిశు మరణాలను నివారించడానికి గర్భం దాల్చిన నుండీ ప్రసవించే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.  బిడ్డ పుట్టగానే తల్లి పాలను అందించాలని, తల్లి స్పర్శ తోనే బిడ్డకు బంధము ఏర్పడుతుందని, బిడ్డ ఆరోగ్యం గా ఉంటుందని పేర్కొన్నారు. అనవసర సెజారిన్ ఆపరేషన్ శరీరానికి నష్టం కలిగిస్తుందని వీటిని తగ్గించాలని అన్నారు.  గ్రామాల్లో పారిశుధ్యం బాగుండాలని, సామాజిక మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, హాండ్ వాష్ మంచి అలవాటని, వీటి పై అవగాహన పెంచాలని అన్నారు.
  నెలకు 15 వేల లోపు ఆదాయం ఉన్న వారిని  ఈ శ్రమ పోర్టల్ లో నమోదు చేయాలని అన్నారు. పొరుగు సేవల్లో, కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న వారు, జాబ్ కార్డ్స్ ఉన్న ఉపాధి కూలీలని గుర్తించి సచివాలయాల్లో నమోదు చేయాలన్నారు.
   చదివే అలవాటు మర్చిపోకుండా ఉండడానికి   వేసవి లో పిల్లలకు స్టోరీ పుస్తకాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. చదువు తో పాటు ఫిసికల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యోగ, క్రీడలలో ఒక పూట శిక్షణ  ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామం లో సచివాలయం, లేదా స్కూల్ పరిధిలో ఆసక్తి ఉండే టీచర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. స్టోరీ రీడింగ్ చేసిన విద్యార్థులు స్కూల్ ప్రారంభం రోజున  క్లాస్ లో స్టోరీ లు చెప్పేలా ఏర్పటు  చేయాలన్నారు.
New checklist for secretariat checks, District Collector Surya Kumari