On the occasion of Sri Ramanavami, the marriage of Sita Rama took place in a grand manner at Ramatirtha on Sunday. Ritualists perform kalyana scientifically in accordance with the mantra charana of Vedic scholars. Botsa Satyanarayana and Jhansi couple donated silk garments, pearl necklaces and welfare items. District Collector Surya Kumari first visited Sitaramula at the temple and inspected the arrangements.
Publish Date : 11/04/2022
👉ఘనంగా సీతారాముల కల్యాణం
👉 ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన బొత్స దంపతులు
విజయనగరం, ఏప్రిల్ 10:: శ్రీ రామనవమి సందర్బంగా ఆదివారం రామతీర్థం లో సీతా రాముల కల్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రో చ్చరణతో శాస్ట్రోక్తంగా ఋత్వికులు కల్యాణం జరిపించారు. బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణానికి అవసరమైన సామగ్రిని అందజేశారు. తొలుత జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆలయం లో సీతారాముల వారిని దర్శించుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బొత్స దంపతులకు దేవాలయం లోనికి పూర్ణ కుంభం తో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. టిటిడి నుండి , సింహాచలం దేవస్థానం నుండి వచ్చిన పండితులు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. గుడి లో పూజలు నిర్వహించిన మీదట కల్యాణ వేదిక వద్దకు చేరుకొని కల్యాణాన్ని ఆద్యంతం తిలకించారు. వేద పండితులు భక్తులందరిని స్వామివారి అక్షింతలు వేసి , తీర్ధ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు, ఎం.ఎల్.సి డా.సూర్యనారాయణ రాజు, జె.సి మయూర్ అశోక్, ఆర్.డి.ఓ భవాని శంకర్, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
👉ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను.
👉మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ::
భద్రాద్రి లో జరిగినట్లే రామతీర్థం లో రాములు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని,
రామతీర్థం రామలు వారి కళ్యాణం లో పాల్గొనడం చాలా ఆనందగా ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కల్యాణం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం భాగ్యం గా భావిస్తున్నానన్నారు..
రాష్ట్రానికి మంచి జరగాలి అని ప్రజలు అందరిపై శ్రీ రాముని కృప కటాక్షాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నానని అన్నారు.
వచ్చే ఏడాది ఈ రామతీర్థం రాములు వారి కళ్యాణం రాష్ట్ర పండుగ గా జరిపేందుకు కృషి జరుగుతుందని తెలిపారు.
కొండ మీద కడుతున్న దేవాలయం పనులు వేగంగా జరుగుతున్నాయ ని,
ఈ ఏడాది జూన్ లోపు ప్రారంభం చేయాలి అని భావిస్తున్నామని అన్నారు..
చైర్మన్, కమిటీ సభ్యులు తో చర్చించి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
