Close

Online Tickets for Pydithallamma Sirimanu festival Celebrations, Collector at 48th Ward Secretariat

Publish Date : 11/10/2021

అమ్మవారి ఉత్సవాలకి  ఆన్లైన్ టికెట్లు

48 వ వార్డు సచివాలయంలో ప్రారంభించిన కలెక్టర్

విజయనగరం, అక్టోబరు 10::   శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఆదివారం  48 వ వార్డ్  సచివాలయంలో  ఆన్లైన్ టిక్కెట్లు విక్రయాలను  ప్రారంభించారు. అనంతరం ఆమె 400 రూపాయల తో రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ   రూ.200/- విలువ గల టికెట్ లను  ఆదివారం నాడు 5 వార్డులో  విక్రయించ నున్నట్లు తెలిపారు. సోమవారం నుండి  మండల ప్రధాన కేంద్రాల్లో టిక్కెట్లు అందుబాటు లో ఉంటాయన్నారు.  టిక్కెట్లు అమ్మిన సంఖ్య ను బట్టి భక్తులకు ఏర్పాట్లను గావిస్తారని త్వరగా భక్త్తులు టిక్కెట్లు కొనుగోలు. చేయాలని అన్నారు.  ఈ మాసం అంత పవిత్రమేనని, భక్తులు ఒకే సారి రావద్దని, కోవిడ్ ఉందని గుర్తు పెట్టుకోవాలి అన్నారు.

    ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ భవాని శంకర్, ఎన్. ఐ. సి డి.ఐ. ఓ నరేంద్ర, కార్పొరేటర్  ధనలక్ష్మి, అమ్మవారి దేవస్థానం ఈ.ఓ కిషోర్ కుమార్,  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Online Tickets for Pydithallamma Sirimanu festival Celebrations