Close

Payment of Rs. 1.07 crore to sugarcane farmers * * District Collector A. Suryankumari

Publish Date : 18/12/2021

*చెరుకు రైతుల‌కు రూ.1.07 కోట్ల చెల్లింపు*
* జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 18 ః బొబ్బిలి ప్రాంతంలోని చెరుకు రైతుల‌కు సంకిలి షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం నిర్ణీత కాలంలో జ‌రిగిన క్రషింగ్‌ మేర‌కు రూ.1.07 కోట్లు బిల్లులు చెల్లింపు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి శ‌నివారం తెలిపారు. ఇప్ప‌టి వ‌రకు బొబ్బిలి స‌మీప ప్రాంతాల్లోని రైతులు 8420 ట‌న్నుల చెరుకును శ్రీ‌కాకుళం జిల్లాలోని సంకిలి షుగ‌ర్ ఫ్యాక్ట‌రీకి త‌ర‌లించార‌ని సంబంధిత బిల్లుల‌ను యాజ‌మాన్యం పూర్తిగా చెల్లించింద‌ని పేర్కొన్నారు. ఎన్‌.సి.ఎస్‌. షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం క్ర‌షింగ్ నిలుపుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేయ‌గా స్థానిక‌ రైతులు పండించిన పంట‌ను సంకిలి షుగ‌ర్ ఫ్యాక్ట‌రీకి త‌ర‌లించాల‌ని అధికార యంత్రాంగం నిర్ధేశించిన విష‌యం విధిత‌మే. ఈ  మేర‌కు స్థానిక రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని గ‌మ‌నించాల‌ని చెరుకు త‌ర‌లింపు, బిల్లుల చెల్లింపు ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని షుగ‌ర్ కేన్ జిల్లా అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ లోకేశ్వ‌ర్ కు క‌లెక్ట‌ర్ ఇది వ‌ర‌కే ఆదేశాలు జారీ చేశారు.

* Payment of Rs. 1.07 crore to sugarcane farmers * * District Collector A. Suryankumari