Re-survey to be completed in Badangi and Ramabhadrapuram zones by October 2nd- Joint Collector tornado tour in Bobbili division
Publish Date : 22/06/2022


విజయనగరం, జూన్ 21:: బొబ్బిలి రెవిన్యూ డివిజన్ లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. బాడంగి గ్రామ సచివాలయాన్ని, కోడూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం తెరలామ్, బొబ్బిలి, మెంటాడా, బాడంగి, రామభద్రపురం మండలాలకు చెందిన తహశీల్దార్లు, వి ఆర్.ఓ లు, సర్వేయర్ల తో బాడంగి లో కళ్యాణమండపం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ అక్టోబర్ 2 లోపల బాడంగి, రామభద్రపురం మండలాల్లో రీ సర్వే పూర్తి కావాలని ఆదేశించారు. గ్రామాలకు ఉదయం 6 గంటలకే చేరుకోవాలని, ముందురోజే టామ్ టామ్ ద్వారా లేదా వాలంటీర్ ప్రజలందరకు తెలియజేయాలని సూచించారు. వీలైతే గ్రామాల్లో రాత్రి బస చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రీ సర్వే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వి.ఆర్.ఓ లు, సర్వేయర్లు వారానికి కనీసం 2,3 గ్రామలైన తిరగాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ శేష శైలజ, సర్వే ఏ.డి త్రివిక్రమ రావు, ఇతర మండలాల సిబ్బంది8 పాల్గొన్నారు.
