Special drive for voter registration on 20th and 21st District Collector A. Suryakumari
Publish Date : 18/11/2021
20,21 తేదీల్లో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 17 ః కొత్త ఓటర్ల నమోదుకు ఈనెల 20,21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో బిఎల్ఓలు అందుబాటులో ఉండి, ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. ఓటరు జాబితాలో, తమ పేర్లను మార్పులు, చేర్పులు కూడా నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని, అవసరమైన పత్రాలతో పోలింగ్ స్టేషన్లకు వెళ్లి, తప్పనిసరిగా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని కలెక్టర్ కోరారు.
