Special Gram Sabhas for crop loans from 24th of this month to 1st of May, District Collector Surya Kumari
Publish Date : 23/04/2022
ఈ నెల 24 నుండి మే 1 వరకూ పంట రుణాల ప్రత్యేక గ్రామ సభలు
జిల్లా కలెక్టరు సూర్య కుమారి
విజయనగరం, ఏప్రిల్ 22:: కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంతవరకు పంటరుణాలు పొందని రైతులకోసం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ గ్రామ సభలు ఈ నెల 24 నుండి మే నెల 1 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో జిల్లా లోని అన్ని బాంక్ లు పాల్గొంటాయని తెలిపారు. రైతు లు గ్రామ సభ లేదా సర్పంచ్ ద్వారా దరఖాస్తు ను బ్యాంకులకు సమర్పించాలన్నారు. ఈ పంట రుణాలను వ్యవసాయ, పశు ఆధారిత, మత్స్యకార రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. పంట ఋణాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ ధన్ స్కీం దసరఖాస్తులను కూడా స్వీకరిస్తారని తెలిపారు. ఈ సభలకు సంబంధిత శాఖల అధికారులతో పాటు రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు.
