Close

Special Principal Secretary, Department of Infrastructure and Investment, Karikala Velivan has directed to complete the construction of houses related to Bhogapuram Airport evacuees quickly.

Publish Date : 26/09/2022

నెలాఖరులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్

విజయనగరం, సెప్టెంబరు 23: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల కు సంబంధించిన గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశించారు. గూడెపు వలస గ్రామంలో దసరా నాడు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో భోగాపురం నిర్వాసితుల కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు, మౌలిక వసతులు పై జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తో కలసి సమీక్షించారు. పొలిపల్లి, గూడెపువలస, బొల్ల0కల పాలెం, రెల్లిపేట గ్రామాల్లో జరుగుతున్న పనులను వర్క్ వారీగా సమీక్షించారు. అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, పోస్ట్ ఆఫీస్, అంగన్వాడీ భవనం వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, సచివాలయం, వెటర్నరీ ఆసుపత్రి, డంపింగ్ యార్డ్, స్మశానం తదితర నిర్మానాలను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా రామాలయం, గ్రామ దేవత అమ్మవారి గుడులను కూడా సిద్ధం చేయాలన్నారు. పెండింగ్ ఉన్న రహదారి పనులకు తక్షణమే టెండర్లను పిలవాలని ఆర్ అండ్ బి ఈఈ కు సూచించారు. పెండింగ్ కోర్ట్ కేసుల పై ఆరా తీయగా అన్నింటి కి కౌంటర్లు వేయడం పూర్తి అయ్యిందని, కేసు లు బెంచ్ వద్ద ఓఎండింగ్ ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఎయిర్పోర్ట్ కు అవసరమగు 2203 ఎకరాలకు గాను 2183 ఎకరాలకు వెజిటేరియన్ క్లియరెన్స్ పూర్తి చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మిగిలిన 10 శాతం కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, ఆర్.డి.ఓ సూర్యకళ, నేషనల్ హై వేస్ ప్రతినిధులు, ఆర్ అండ్ బి ఎస్.ఈ జయశ్రీ , తహసీల్దార్ శ్రీనివాస రావు, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ. ఎస్ , విద్యుత్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Special Principal Secretary, Department of Infrastructure and Investment, Karikala Velivan has directed to complete the construction of houses related to Bhogapuram Airport evacuees quickly.