Close

Talk to the petitioners and give a satisfactory answer, 251 petitions for response, District Collector Suryakumari

Publish Date : 24/08/2022

అర్జీదారులతో మాట్లాడి  సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వాలి

స్పందనకు 251 వినతులు

స్పందన కు  హెచ్.ఓ.డి లు హాజరు కావాలి

జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, ఆగస్టు 22:  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 251 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 34, డి.ఆర్.డి.ఏ కు 32, అందగా అత్యధికంగా   రెవిన్యూ కు సంబంధించి 195 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి,  ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ స్పందన వినతులను పరిష్కరించే ముందు అర్జీదారు తో మాట్లాడి వారికి సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వాలని ఆదేశించారు.  అప్పుడు మాత్రమే రీ ఓపెన్ లోకి వెళ్లకుండా డిస్పోజల్  అవుతుందని అన్నారు.

 ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. అధికారులు స్పందన లాగిన్ లో స్వయంగా వినతులు పరిశీలించి, సమాధానం నాణ్యత ఉండేలా పరిష్కారం చేయా లన్నారు.

            స్పందన కార్యక్రమం ప్రాధాన్యత ను  గుర్తించాలని, శాఖల ఉన్నతాధికారులే సోమవారం హాజరు కావాలని వీలున్నంతవరకు సోమవారం సెలవులు పెట్టారాదని అధికారులకు కలెక్టర్ సూచించారు. మండల ప్రత్యేకధికారులు వారి తనిఖీలలో  గుర్తించిన అంశాలను రిమార్కు లను తెలియజేయాలని  సూచించారు.

Talk to the petitioners and give a satisfactory answer, 251 petitions for response, District Collector Suryakumari