Close

The District Collector and District Election Officer Mrs. A Suryakumari disclosed that the registration program for graduates voters has started in the district from Saturday.

Publish Date : 04/10/2022

నేటి నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం: జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి

విజయనగరం, అక్టోబర్ 01: పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం శనివారం నుంచి జిల్లాలో ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి ఏ సూర్యకుమారి వెల్లడించారు. అర్హులైన వారంతా అవసరమైన ధృవ పత్రాలను ఓటర్ల నమోదు అధికారులకు అందజేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 30, 2019 నాటికి పట్టభద్రులైన వారంతా ఓటరు గా నమోదుకు అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ డిగ్రీ, ఎం.బి.బి.ఎస్., అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ డిగ్రీ పట్టభద్రులు కూడా దీనికి అర్హులని పేర్కొన్నారు. ఓటరుగా నమోదు కోసం ఫారం -18 లో తమ దరఖాస్తులను అందజేస్తూ, ఆ దరఖాస్తుతో పాటు డిగ్రీ ప్రోవిజనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయాలని తెలిపారు. పూర్తి వివరాలతో, సంబంధిత డాక్యుమెంట్ లను జత చేసిన దరఖాస్తులను ఆర్.డి.ఓ, లేదా తహశీల్దారు కార్యాలయంలో నవంబర్ 7వ తేదీ లోగా అందజేయాలని కోరారు. ఆన్ లైన్ లో ceoandhra.nic.in వెబ్ సైట్ ద్వారా కూడా ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

The District Collector and District Election Officer Mrs. A Suryakumari disclosed that the registration program for graduates voters has started in the district from Saturday.