Close

The District Collector said that all the convergence works proposed with the employment guarantee funds should start immediately. Surya Kumari ordered the officers

Publish Date : 24/02/2022

ప్రతిపాదించిన పనులన్నీ వెంటనే  ప్రారంభం కావాలి

 ఏ.ఈ వారీగా లక్ష్యాలు

ఉపాధి హామీ కన్వర్జెన్స్ సమావేశం లో జిల్లా కలెక్టర్ సూచనలు

విజయనగరం, ఫిబ్రవరి 23 ::   ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదించిన కన్వర్జెన్స్ పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు.  ఈ మార్చ్ నెల  ఆఖరు నాటికి 440 కోట్ల నిధులను ఖర్చు చేయవలసి ఉందని,  సమయం తక్కువగా ఉన్నందున సంబంధిత శాఖల అధికారులంతా  అత్యంత ప్రాధాన్యత నిచ్చి పని చేయాలన్నారు.   బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో కన్వర్జెన్స్ పనుల పై సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  వారం వారం లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రతి శని వారం ప్రగతి నివేదికలు అందజేయాలని ఆదేశించారు.  ఏ వారం లక్ష్యాలు ఆ వారం లోనే సాధించాలని సూచించారు.  ప్రారంభం అయిన ప్రతి వర్క్ ను జియో  టాగింగ్   చేసి, ఫోటో లు అప్లోడ్ చేయాలన్నారు.

        ఇంతవరకు 1173 పనులకు  53 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో అంచనాలు జనరేట్ అయ్యాయని తెలిపారు.  ప్రధానంగా ప్రహరి గోడలు, శ్మశాన వాటికలు, చెక్ డాం లు, రహదారి నిర్మాణాలు ఉన్నాయని  తెలిపారు.  బోర్వేల్స్  రీఛార్జి స్ట్రక్చర్స్  చేయుటకు 1343 పనులను 6 కోట్లతోను, మత్స్య శాఖ ద్వారా 461 పనులను గుర్తించడం జరిగిందన్నారు. ఆర్.డుబ్లు.ఎస్. ద్వారా  969  సిసి డ్రైన్ పనులను 134.29 కోట్ల తో, 532 ఇరిగేషన్ సంబంధిత  పనులకు 54.15 కోట్లతో చేయుటకు గుర్తించామన్నారు. పంచాయతి రాజ్ శాఖ ద్వారా 10,896 పనులను 963.51 కోట్ల రూపాయలతో ప్రతిపాదించడం జరిగిందన్నారు.  ఈ  పనులే కాకుండా  పశు సంవర్ధక శాఖ ద్వారా పశు గ్రాసం పెంపకానికి, గృహ నిర్మాణా ల వద్ద అప్రోచ్ రోడ్ లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.  ప్రతి శాఖ ద్వారా చేపట్టే ప్రతి పనికి ఒక ఏ.ఈ స్థాయి అధికారిని బాధ్యత గా పెట్టాలని అన్నారు.  నెల లోపల  ప్రతిపాదిత పనులన్నీ ప్రారంభం కావడానికి అవసరమగు వనరులను స్థానికంగా సమకూర్చుకోవాలని అన్నారు.

ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్, జే.సి హౌసింగ్ మయూర్ అశోక్, డ్వామా పి.డి ఉమా పరమేశ్వరి, డి.పి.ఓ సుభాషిని, పంచాయతి రాజ్ ఎస్.ఈ.  గుప్తా, సమగ్ర శిక్ష ఎస్.ఈ తదితరులు పాల్గొన్నారు.

The District Collector said that all the convergence works proposed with the employment guarantee funds should start immediately. Surya Kumari ordered the officers