The land acquisition should be completed within the stipulated time frame, Joint Collector Dr. GC Kishore Kumar
Publish Date : 24/02/2022
నిర్ణీత కాలవ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్
విజయనగరం, ఫిబ్రవరి 23 ః జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం యూనిట్ల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి, రామతీర్ధసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామతీర్ధసాగర్, గుమ్మిడిగెడ్డ, అడారుగెడ్డ, గడిగెడ్డ తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాసితుల పునరావాసం పై దృష్టిపెట్టాలని, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల పనులను త్వరగా పూర్తి చేసి, నిర్వాసితులను తరలించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ఇప్పటికీ కొన్నిచోట్ల పెండింగ్‌లో ఉందని, దానిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి, న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూసేకరణపై గ్రామాలవారీగా సమీక్షించారు.
ఈ సమావేశంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, విజయనగరం ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, భూసేకరణ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఛీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ ఎన్.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.రామచంద్రరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
