Close

The notification for the filling of various posts in the medical department, the deadline for the grievance of the candidates till 6th of this month, the district collector has given many instructions to the candidates.

Publish Date : 07/09/2022

వైద్య శాఖలో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్

ఈ నెల 6వ తేదీ వరకు  అభ్యర్ధుల గ్రీవెన్సు కు గడువు

అభ్యర్ధులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్

విజయనగరంసెప్టెంబర్ 02: వైద్య శాఖకు సంబంధించిన  ఉమ్మడి జిల్లాల్లో పలు కేటగిరీ లలో 194 పోస్టు లకు ఆగష్టు 29  నాటికీ ఉన్న ఖాళీలతో  రోస్టర్ వారీగా  నోటిఫికేషన్ జరీ చేయడం జరిగిందని జిల్లా  కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పోస్టులు   జిల్లా  వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారివైద్య విధాన పరిషత్మెడికల్ కాలేజీబోధనా ఆసుపత్రి విజయనగరం వారి  అధీనంలో వివిధ కేటగిరీ లలో  భర్తీ చేయుటకు (కంబైన్డ్  నోటిఫికేషన్) ఇవ్వడం జరిగిందని తెలిపారు.   ఇందుకు సంబదించిన దరఖాస్తులు సమర్పించిన వారి ప్రొవిజనల్ జాబితానుపోస్టులురోస్టర్ రిజర్వేషన్ తదితర  వివరాలను  ఆన్ లైన్ లో http://vizianagaram.ap.gov.in (or) http://vizianagaram.nic.in“ నందు పొందుపరచడం జరిగిందని తెలిపారు.  దీనికి సంబందించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు అయితే పూర్తి ఆధారాలు తో,  సర్వీసు సర్తిఫికేట్ ఉన్నవారు తమ సర్టిఫికేట్ అసలు కాపీని నియామక అధికారితో కౌంటరు సిగ్నేచర్ చేస్తూ,  నియామక ఉత్తర్వులు కూడా జత చేసి గెజిటెడ్ ఆఫీసరు వారితో   ధ్రువీకరణ చేయించి నేరుగా శ్రీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారివిజయనగరం వారి కార్యాలయమునకు ఈ నెల 6 వ తేదీ  సాయంత్రం 5.గ.ల లోపు తమ గ్రివేన్స్ సమర్పించ వలసి ఉంటుందని తెలిపారు.

అభ్యర్ధులకు సూచనలు:

 నియమకాలు అన్ని ప్రభుత్వ నియమ నిబంధనులు మేరకు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని, . ఏ ఒక్క అభ్యర్ధి కూడా ఎటువంటి  ప్రలోభాలకు గురికావద్దు అని తెలియజేసారు.

  • అభ్యర్ధులు పలు రకాల పోస్టులకు దరఖాస్తు చేసినప్పటికీ కౌన్సిలింగ్  రోజున ఎంపిక కాబడిన పోస్టు   

           లోనే నియామకం చేయడం జరుగు తుందన్నారు.

  •  పోస్టులలో ఇంటర్చేంజ్  ఉండదని స్పష్టం చేసారు.
  • ఎక్కడ నియమిస్తే అక్కడే పని చేయవలసి ఉంటుందన్నారు.
  • రోస్టర్ ప్రకారంగా మెరిట్ లిస్టు తయారు చేయబడిఆ మెరిట్ జాబితాను ఒక సంవత్సరం పాటు పరిగణ  

            లో తీసుకోవడం జరుగుతుందన్నారు.

  • కౌన్సిలింగ్ అనంతరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందనితప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించినచో

            వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

  • కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
The notification for the filling of various posts in the medical department, the deadline for the grievance of the candidates till 6th of this month, the district collector has given many instructions to the candidates.