Close

The petitions should be resolved by talking to the petitioners, 123 requests for response, Joint Collector Mayur Ashok

Publish Date : 17/05/2022

అర్జీదారులతో మాట్లాడి వినతుల పరిష్కారం చేయాలి

స్పందనకు 123 వినతులు

సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్

విజయనగరం, మే  16:  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 123 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం  వైద్య శాఖకు 25, డి.ఆర్.డి.ఏ కు 9 వినతులు  అందగా  రెవిన్యూ కు సంబంధించి 88 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే,  గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు   సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ సూర్యనారాయణ స్వీకరించారు.

       అనంతరం అధికారులతో సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ   రీ ఓపెన్ అయిన  వినతుల పై అర్జీదారులతో మాట్లాడి ,సహేతుకంగా  పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు  స్వయంగా ప్రత్యేక పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క శాఖ వద్ద ఏ ఒక్క స్పందన దరఖాస్తు  గడువు దాటి ఉన్నా సహించేసి లేదని స్పష్టం చేశారు.

        మండల ప్రతేకాధికారులు మంగళవారం  సమీక్షా సమావేశాలు నిర్వహించే ముందు క్షేత్ర స్థాయి లో హౌసింగ్ లే ఔట్లను, ప్రస్తుతం జరుగుతున్న  నాడు నేడు పనులను తనిఖీ చేయాలన్నారు. వీటి పై ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు.

     డి.ఆర్.ఓ గణపతి రావు మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లో జరుణ్య నియామకాల ఖాళీలు, పొరుగు సేవల పోస్టుల్లో  ఉన్న ఖాళీల వివరాలను కలెక్టరేట్ కు వెంటనే  పంపాలని సూచించారు.

The petitions should be resolved by talking to the petitioners, 123 requests for response, Joint Collector Mayur Ashok