Close

The re-survey should be completed within the stipulated time, the details of government lands should be available to everyone, the Collector clarified in the training program of DTs.

Publish Date : 25/07/2022

నిర్దేశించిన గడువు లోనే రీ సర్వే పూర్తి కావాలి

ప్రభుత్వ భూముల వివరాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి

 డిటి ల శిక్షణా కార్యక్రమంలో స్పష్టం చేసిన కలెక్టర్

విజయనగరం, జూలై 23:: రీ సర్వే కార్యక్రమం అనుకున్న సమయానికే తప్పకుండా జరగాలని కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ఎన్నికల నిర్వహణ స్ఫూర్తి గా తీసుకొని అవసరమైతే రాత్రిళ్ళు కూడా పని చేయాలన్నారు. ఉప తఃసిల్దార్లకు రీ సర్వే పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కె.ఆర్.సి ఉప కలెక్టర్ సూర్యనారాయణ ,  సర్వే సహాయ సంచాలకులు త్రివిక్రమ రావు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపులో కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే లో అలసత్వాన్ని, అలస్యాన్ని సహించేది లేదన్నారు. ఏ ఏ గ్రామాల్లో సర్వే కు వెళ్తున్నారో ఆయా గ్రామాల్లో ముందు రోజే టామ్ టామ్ వేయాలని, ఆ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులకు కూడా తెలియ జేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ సచివాలయంలో షెడ్యూల్ డిస్ప్లే చేయాలన్నారు.  ప్రతి అంశాన్ని రికార్డ్ చేయాలని, భవిష్యత్తు లో ఏవైనా లిటీగేషన్లు , కోర్ట్ కేసు లు ఉంటే ఆధారాలతో సంబంధిత తహసీల్దార్, డిటి లే హాజరు కావాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావియ్యకుండా జాగ్రత్తగా పని చేయాలన్నారు. డైలీ ప్రోగ్రెస్ పై నివేదికలు అందజేయాలని, ప్రతి రోజు సీసీఎల్ ఏ స్వయంగా సమీక్షిస్తూ న్నారని, ఎక్కడైనా ప్రోగ్రెస్ తగ్గితే వారే స్వయంగా మీతో మాట్లాడతారని తెలిపారు.

ప్రభుత్వ భూములను ముందుగా గుర్తించి వాటి జాబితాలను అందరి వద్ద పెట్టుకోవాలన్నారు. ఈ భూములన్నింటికి పోస్ట్ అవార్డ్ జరగాలని, లేదంటే ఇవి వెబ్ ల్యాండ్ లో కనపడని స్పష్టం చేశారు.  ఎవరికైనా కంప్యూటర్లు, ఇతర అవసరమగు మెటీరియల్ అవసరమైతే లేఖ రాస్తే సమకూరుస్తామని తెలిపారు.  నీటిపారుదల, హౌసింగ్, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు సేకరించిన ప్రభుత్వ భూముల మ్యూటేషన్ వెంటనే జరగాలన్నారు.

సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రీ సర్వే కార్యక్రమానికి డి.టి లే నోడల్ అధికారులని అన్నారు. 1బి, అడాంగల్  లోని తప్పులన్నిటిని సవరించాలన్నారు. సర్వే లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. క్రింది వారికి కూడా శిక్షణ ఇవ్వాలన్నారు.  శాశ్వత రికార్డ్ కావున  ఖచ్చితంగా రీ సర్వే ఉండాలన్నారు.

The re-survey should be completed within the stipulated time, the details of government lands should be available to everyone, the Collector clarified in the training program of DTs.