Close

Three more farmer production associations in the district, set up with the financial assistance of the Central Government, have been proposed in the District Level Oversight Committee.

Publish Date : 05/01/2022

జిల్లాలో మ‌రో మూడు రైతు ఉత్ప‌త్తి సంఘాలు

కేంద్ర ప్ర‌భుత్వ ఆర్ధిక స‌హాయంతో ఏర్పాటు

జిల్లా స్థాయి ప‌ర్య‌వేక్ష‌క క‌మిటీలో ప్ర‌తిపాద‌న‌

విజ‌య‌గ‌న‌రం, జ‌న‌వ‌రి 05; జిల్లాలో కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో సెంట్ర‌ల్ సెక్టార్ స్కీమ్ కింద ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం(2021-22)లో కొత్త‌గా మూడు రైతు ఉత్ప‌త్తి సంఘాలు(Farmer Produce Organizations-FPOs) క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగిన జిల్లా స్థాయి ప‌ర్య‌వేక్ష‌క క‌మిటీ స‌మావేశంలో నిర్ణ‌యించారు. జిల్లాలో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్న న‌బార్డు ఆధ్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌ర్  అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ఈ మేర‌కు ప్ర‌తిపాదిస్తూ తీర్మానం చేశారు. బొబ్బిలి, గ‌జ‌ప‌తిన‌గ‌రం, విజ‌య‌న‌గ‌రం గ్రామీణ ప్రాంతాల్లో మూడు కొత్త రైతు ఉత్ప‌త్తి సంఘాల‌ను ఏర్పాటు చేసేందుకు ఈ స‌మావేశంలో ఆమోదించారు. ఒక్కో సంఘానికి ఐదేళ్ల వ్య‌వ‌ధిలో కేంద్ర ప్ర‌భుత్వం రూ.43 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జిల్లాలో ఇప్ప‌టికే ఈ ప‌థ‌కంలో చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల లో రెండు సంఘాలు వున్నాయ‌ని పేర్కొన్నారు.

    బొబ్బిలి క్ల‌స్ట‌ర్‌లో రామ‌భ‌ద్ర‌పురం, బొబ్బిలి, బాడంగి, బ‌లిజిపేట‌, సీతాన‌గ‌రం మండ‌లాలు వుంటాయ‌ని న‌బార్డు ఏ.జి.ఎం. హ‌రీష్ తెలిపారు. మొక్క‌జొన్న‌, అప‌రాలు, కూర‌గాయ‌లు, ప‌ళ్లు త‌దిత‌ర వ్య‌వ‌స‌య ఉత్ప‌త్తుల విక్ర‌యాలు ఈ సంఘం ద్వారా చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు.

      గ‌జ‌ప‌తిన‌గ‌రం క్ల‌స్ట‌ర్‌లో గ‌జ‌ప‌తిన‌గ‌రం, బొండ‌ప‌ల్లి, ద‌త్తిరాజేరు, మెంటాడ మండ‌లాలు భాగంగా వుంటాయ‌ని మొక్క‌జొన్న‌, అప‌రాలు, కూర‌గాయ‌లు, ప‌ళ్లు త‌దిత‌ర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల విక్ర‌యాలు ఈ సంఘం ద్వారా చేప‌డ‌తామ‌ని పేర్కొన్నారు.

      విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ క్ల‌స్ట‌ర్‌లో విజ‌య‌న‌గ‌రం రూర‌ల్‌, డెంకాడ‌, పూస‌పాటిరేగ‌, భోగాపురం త‌దిత‌ర మండ‌లాలు వుంటాయ‌ని, ఈ సంఘం ద్వారా ప‌ళ్లు, కూర‌గాయ‌లు, పూలు, కొబ్బ‌రి త‌దిత‌ర ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.
ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రైతు ఉత్ప‌త్తి సంఘంలో లేని మండ‌లాల‌ను ఈ కొత్త క్ల‌స్ట‌ర్ల‌లో భాగంగా చేసిన‌ట్లు ఏజిఎం తెలిపారు. బ్రెడ్స్ ఎన్‌.జి.ఓ. ఈ ఉత్ప‌త్తి సంఘాల ఏర్పాటు, అందులోని స‌భ్యుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం, వాటి కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌లో స‌హ‌క‌రించ‌డం వంటి అంశాల్లో స‌హ‌క‌రిస్తుంద‌ న్నారు.

     జిల్లాలో మ‌త్స్య‌కార ఉత్ప‌త్తుల విక్ర‌యానికి కూడా త‌గిన మార్కెటింగ్ వ‌స‌తులు క‌ల్పించ‌డంపై దృష్టి సారించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Three more farmer production associations in the district, set up with the financial assistance of the Central Government, have been proposed in the District Level Oversight Committee.