Close

Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.

Publish Date : 14/10/2022

శ్రీ రాజ‌గోపాలస్వామి ఆల‌యంలో ప్రాచీన గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న‌,
సాహిత్య కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 09 ః
విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు మ‌న సంస్కృతి, క‌ళ‌లు, సాహిత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు వేదిక‌గా మారాయి. తెలుగు భాష‌కే ప్ర‌త్యేక‌మైన అవ‌ధాన క‌ళ, మ‌న్నార్ శ్రీ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యింది.
ఇక్క‌డ ఏర్పాటు చేసిన ప్రాచీన గ్రంథాలు, ప్రాచ్య గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ అల‌రించింది. ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి ప్రారంభించారు.
తొలిరోజు ఆదివారం రాజ‌మండ్రికి చెందిన తాతా సందీప‌శ‌ర్మ అవ‌ధానం చేసి ఆక‌ట్టుకున్నారు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కె.బాబూరావు ఆధ్వ‌ర్యంలో ఎనిమిది మంది క‌వులు ప‌థ్య‌ప‌ఠ‌నం గావించారు. కాళ్ల నిర్మ‌లాకుమారి హ‌రిక‌థా గానం, కాళ్ల అప్పారావు బుర్ర‌క‌థ‌, ఇత‌ర సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్రేక్ష‌కుల‌ను ఆనంద‌ప‌రిచాయి. జిల్లా నైపుణ్యాధికారి డాక్ట‌ర్ ఎన్‌.గోవింద‌రావు, డైట్ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ఎన్‌.తిరుప‌తిరావు, మ‌హారాజా సంస్కృత క‌ళాశాల ప్రిన్సిపాల్ గౌరీశ్వ‌ర్రావు వేదిక బాధ్యులుగా వ్య‌వ‌హ‌రించి, కార్య‌క్ర‌మాల‌ను స‌జావుగా నిర్వ‌హింప‌జేశారు. కార్య‌క్ర‌మంలో మ‌హారాజా సంస్కృత క‌ళాశాల‌, ప్ర‌భుత్వ‌ డిగ్రీ క‌ళాశాల అధ్యాప‌కులు పాల్గొన్నారు.

Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.