News
Cement companies should be given dry rubbish, Panchayati Raj Chief Secretary Gopalakrishna Dwivedi, Job Cards for all eligible: District Collector Smt. Suryakumari
Published on: 30/05/2022సిమెంటు కంపెనీలకు పొడి చెత్త తరలించాలి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అర్హులందరికీ జాబ్ కార్డులు : జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి విజయనగరం, మే 26 : గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన పొడి చెత్తను వారం రోజులకోసారి సమీపంలోని సిమెంటు కంపెనీలకు తరలించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. ఆయా సిమెంటు కంపెనీలు చెత్తను తీసుకునేందుకు సిద్ధంగా వున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్‌లతో ముఖ్య కార్యదర్శి […]
Special ambulance courtesy of Power Grid Corporation;* District Collector A. Suryakumari who started waving the flag;* Participating Red Cross Society Representatives, Volunteers
Published on: 27/05/2022పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రత్యేక అంబులెన్స్ *జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *భాగస్వామ్యమైన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వాలంటీర్లు విజయనగరం, మే 26 ః జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని సదుపాయాలతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సేప్టీ సపోర్ట్ అంబులెన్స్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాకు సమకూర్చింది. రూ.30 లక్షల సీఎస్ఎర్ నిధులతో జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్‌ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సౌత్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ […]
Training Program for Ward Secretariat Secretaries, District Collector Surya Kumari
Published on: 27/05/2022వార్డ్ సచివాలయ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలి చేస్తున్న పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ` * ప్రతిభను ప్రజా సేవకు వినియోగించాలి – ఎం.ఎల్.ఏ కోలగట్ల విజయనగరం, మే 25 : సచివాలయానికి సమస్యల తో వచ్చేవారికీ సరైన పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరుకు అద్దం పట్టేలా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియం లో బుధవారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నున్న వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి పాదనలు పంపుతున్నామని, ఉద్యోగులు ఇంకా ఉత్తేజంగా, చిత్తశుద్ధి తో పని చెయ్యాలని అన్నారు. కార్పొరేషన్ పరిధి లో రెవిన్యూ కలెక్షన్ లో, సిటిజెన్ అవుట్ రీచ్ లో ముందున్నామని, అయితే ఇంకా అనేక సేవలలో మెరుగు పడాల్సి ఉందని పేర్కొన్నారు. చేసే పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అప్పడే పూర్తిగా మనసు పెట్టి చేయగలమని అన్నారు. ఎందరికో రానటువంటి అవకాశం మీకు వచ్చిందని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి క్రమ శిక్షణ తో పని చేయాలనీ హితవు పలికారు., పదవి తో సంబంధం లేకుండా శాసన సభ్యులు కోలగట్ల నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు వారే స్వయంగా పరిష్కరిస్తున్నారని, అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు. మంచి పని చేసే వారిని ఏ ఒక్కరూ అడ్డుకోరని , ఎంతైనా చేయవచ్చని, అది పది మందికి ఉపరించేలా ఉండాలని అన్నారు. జాబు చార్ట్ లోని పనులే కాకుండా వినూత్నంగా అలోచించి ప్రజలకు మేలు చేసే పని దేనినైనా స్వాగతిస్తామని తెలిపారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి, పారదర్శకంగా , ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టారని, మీ ప్రతిభను ప్రజా సమస్యల పరిష్కారం లో చూపించాలని అన్నారు. ఎంతో నమ్మకం తో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారని, ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించాలని అన్నారు. సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారని , ప్రజలతో మమేకం అయి, అందరిని కలుపుకొని పని చేయాలనీ అన్నారు. పాలన అనేది నిరంతర ప్రక్రియ అని, బాధ్యతాయుతంగా నడిపిస్తే వ్యవస్థ చక్కగా నడుస్తుందని అన్నారు. జిల్లా కలెక్టరు గా చేరిన నుండి సూర్య కుమారి గారు కఠినంగా వ్యవహరిస్తూ అలసత్వాన్ని సహించేది లేదంటూ జిల్లా పాలనను గాడిలో పెట్టారని తెలిపారు. కలెక్టరు, కమీషనర్ మాత్రమే బాధ్యత తీసుకుంటే కుదరదని, ప్రతి ఉద్యోగి వారి బాట లో నడిచి విధి నిర్వహణ లో చిత్తశుద్ధి కనపరచాలని అన్నారు. అంతే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా కలుపుకొని వెళ్ళాలని అప్పుడే ప్రజలకు అవసరమగు సేవలు అవసరమైనపుడు అందుతాయని పేర్కొన్నారు. క్రింది స్థాయి వారితో మాట్లాడడం తక్కువని భావించరాదని, సేవ చేసే అవకాశం రావడమే అదృష్టమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆర్.శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమగు శిక్షణలు అందిస్తూ, వారి సేవల పర్యవేక్షణకు నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసామన్నారు. ప్రజామోద యోగ్యమైన సేవలందించేలా వ్యవస్థను తీర్చి దిద్దుతామని అన్నారు. సహాయ కమీషనర్ ప్రసాద్ పవర్ పాయింట్ పై సచివాలయ ఉద్యోగుల సేవలు, స్పందన వినతుల పరిష్కారం , ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాల పై వివరించారు. మున్సిపల్ ఇంజనీర్ దిలీప్, ఇతర సెక్షన్ హెడ్స్, ప్లానింగ్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. హైదారాబాదు నుండి వచ్చిన సుధీర్ ఈ శిక్షణా కార్యక్రమంలో మోటివేషనల్ తరగతి నిర్వహించారు.
Collector who inspected Gunkalam Jagannanna Colony
Published on: 25/05/2022గుంకలాం జగనన్న కాలనీని పరిశీలించిన కలెక్టర్ విజయనగరం, మే 24: గుంకలాం జగనన్న కాలనీని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఆమె కాలనీలో పర్యటించి, ఇళ్ళ నిర్మాణాన్ని తనికీ చేశారు. హౌసింగ్ డిఈ రంగారావు తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. థర్డ్ ఆప్షన్ ఇచ్చిన వారికి, డి బ్లాక్ లో చేపడుతున్న కాంట్రాక్ట్ ఇళ్ళ నిర్మాణం పై ఆరా తీశారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
* Shilparamam into use from June 1 * * Collector Suryakumari inspects development programs and facilities
Published on: 25/05/2022*జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం* *అభివృద్ధి కార్యక్రమాలను, వసతులను పరిశీలించిన కలెక్టర్ సూర్యకుమారి *మరింత సుందరీకరణగా మలచాలని అధికారులకు ఆదేశాలు విజయనగరం, మే 24:- విజయనగరంలోని నల్ల చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం శిల్పారామాన్ని జూన్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పర్యాటక శాఖ, శిల్పారామం అధికారులను ఆదేశించారు. పచ్చని చెట్లు, నీటి కొలను, ఓపెన్ ఆడిటోరియం, సుందరమైన పార్కు ఆకట్టుకునేలా ఉన్నాయని.. వాటికి […]
Ideal for other villages Nandigam District Collector A. Suryakumari lauded the development programs and congratulated Sarpanch.
Published on: 25/05/2022ఇతర గ్రామాలకు ఆదర్శం నందిగాం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అభివృద్ది కార్యక్రమాలపై ప్రశంసలు సర్పంచ్‌ను అభినందించిన కలెక్టర్ భోగాపురం (విజయనగరం), మే 24 ః జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసిన భోగాపురం మండలం నందిగాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సందర్శించారు. ఆమె మంగళవారం గ్రామంలో పర్యటించి, అభివృద్ది కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. గ్రామాన్ని […]
A virtual conference with the beneficiaries of the central government schemes as part of the Prime Minister’s face-to-face Azad ka Amrit Mahotsav, the Prime Minister will speak from Shimla, Himachal Pradesh on the 31st of this month
Published on: 24/05/2022కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్దిదారులతో ప్రధాని ముఖా ముఖి ఆజాది క అమృత్ మహోత్సవ్ లో భాగంగా వర్చువల్ కాన్ఫరెన్స్ ఈ నెల 31 న హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుండి మాట్లడనున్న ప్రధాని విజయనగరం, మే 24 : ఆజాది క అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ది దారులతో ముఖా ముఖి మాట్లాడనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో […]
Cancellation of houses which have not started construction, Convergence works should be started immediately, Special focus on Rajam constituency, District Collector A. Suryakumari
Published on: 24/05/2022నిర్మాణం ప్రారంభించని ఇళ్లు రద్దు కన్వర్జెన్సీ పనులను వెంటనే మొదలు పెట్టాలి రాజాం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 23 ః నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని అధికారులను, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రాధాన్యతలకు అనుగుణంగా వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. ఉపాధి కన్వర్జెన్సీ పనులు, గృహనిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశాన్ని, రాజాం నియోజకవర్గంలోని మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్‌ను […]
120 requests for response, quality redressal should take place, District Collector Suryakumari
Published on: 24/05/2022స్పందనకు 120 వినతులు క్వాలిటీ రెడ్రెస్సల్ జరగాలి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, మే 23: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 120 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 10, డి.ఆర్.డి.ఏ కు 07 అందగా రెవిన్యూ కు సంబంధించి 103 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఉప కలెక్టర్లు సూర్య నారాయణ, పద్మావతి, స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ ఏ ఒక్క స్పందన […]
One hundred percent registration of pregnant women should take place, said District Collector Surya Kumari
Published on: 23/05/2022గర్భిణీల నమోదు శత శాతం జరగాలి జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, మే 21:: జిల్లాలో గర్భిణీల నమోదు శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వైద్య ఆరోగ్య, మహిళా శిశు అభివృద్ధి అధికారులతో గర్భిణీలు నమోదు, ప్రసవం వరకు వారిని పర్యవేక్షించే తీరు పై సీడీపీఓ లతో, వైద్యులతో సమీక్షించారు. జిల్లాలో గర్భిణీల నమోదు 96.4 శాతం ఉండగా మిగిలిన వారిని […]