News
Special function for accelerating housing, Collector setting weekly targets.
Published on: 23/05/2022గృహనిర్మాణం వేగవంతానికి ప్రత్యేక కార్యాచరణ వారం వారం లక్ష్యాలను నిర్ధేశించిన కలెక్టర్ విజయనగరం, మే 21 ః జిల్లాలో జగనన్న గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తరచూ జగనన్న కాలనీలను సందర్శించి, పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడమే కాకుండా, సంబంధిత అధికారులకు వారం వారం లక్ష్యాలను నిర్ధేశించారు. మండలాల వారీగా, రెవెన్యూ డివిజన్ల వారీగా […]
Italian couple who adopted an Indian girl * handed over the girl in the presence of Collector Suryakumari
Published on: 23/05/2022భారతీయ బాలికను దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు *కలెక్టర్ సూర్యకుమారి సమక్షంలో బాలికను అప్పగించిన అధికారులు విజయనగరం, మే 21 ః విజయనగరంలోని శిశుగృహలో ఆసరా పొందుతున్న వర్షిణీ అనే నాలుగేళ్ల భారతీయ బాలికను ఇటలీకి చెందిన దంపతులు స్టాన్కానెల్లి జియాన్కార్లో, కావల్లారో సిల్వానా దత్తత తీసుకున్నారు. కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ పూర్తి కాగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సమక్షంలో ఐసీడీఎస్ అధికారులు శనివారం సంబంధిత బాలికను ఇటలీ దంపతులకు అప్పగించారు. బాలిక […]
Sakhi program in coordination with all departments, day-to-day work should be expedited, District Collector Surya Kumari
Published on: 23/05/2022అన్ని శాఖల సమన్వయం తో సఖి కార్యక్రమం నాడు- నేడు పనులను వేగంగా జరపాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగాం, మే 21 : కిషోర బాలికల అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య ను అందించాలనే ఉద్దేశ్యం తో జిల్లాలో అమలు జరుపుతున్న సఖి కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయం తో విజయవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పిలుపు నిచ్చారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల […]
APIIC site for setting up of rice mills, farmers should be made aware of new grain cultivation, JICA works should be completed before release of water, ZP Chairman Majji Srinivasa Rao at District Agriculture Advisory Council meeting
Published on: 23/05/2022రైస్ మిల్లుల ఏర్పాటుకు ఏ.పి.ఐ.ఐ.సి స్థలం నవ ధాన్యాల సాగు పై రైతులకు అవగాహన కలిగించాలి నీటి విడుదలకు ముందే జైకా పనులు పూర్తి కావాలి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం లో జెడ్ పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు విజయనగరం, మే 20 : జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని వరిపంట స్థానం లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మరలించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు […]
Sharpen your skills … Become a winner * Collector Suryakumari at the inaugural function of Mission Nirman-2022
Published on: 20/05/2022నైపుణ్యాలకు పదును పెట్టండి… విజేతలుగా నిలవండి *మిషన్ నిర్మాణ్ -2022 కార్యక్రమ ప్రారంభోత్సవంలో కలెక్టర్ సూర్యకుమారి *ప్రతి ఒక్కరూ చరిత్ర మెచ్చే విజేతలుగా నిలవాలని ఆకాంక్ష *తొలి రోజు ఆంగ్ల భాష ఆవశ్యకతను, అవకాశాలను వివరించిన నిపుణులు విజయనగరం, మే 19 ః మిషన్ నిర్మాణ్ – 2022 పేరిట స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో ఐదు రోజుల పాటు జరగబోయే శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. […]
Come forward for the establishment of industries, strive for those who achieve results, District Collector calls for women, special program for digital education
Published on: 20/05/2022పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి ఫలితాన్ని సాధించేవరకూ ప్రయత్నించాలి మహిళలకు జిల్లా కలెక్టర్ పిలుపు డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం విజయనగరం, మే 19 ః పరిశ్రమలను స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విటి అగ్రహారం టిటిడిసిలో జిల్లా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు, వివిధ శాఖల […]
* Mission Construction from today – 2022 * * Collector Suryakumari’s suggestion to the students to take advantage of the skill training for five days as the venue of Anandanigajapathi Auditorium *
Published on: 19/05/2022*నేటి నుంచి మిషన్ నిర్మాణ్ – 2022* *ఆనందగజపతి ఆడిటోరియం వేదికగా ఐదు రోజుల పాటు నైపుణ్య శిక్షణ *సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూర్యకుమారి సూచన విజయనగరం, మే 18 ః మిషన్ నిర్మాణ్ – 2022 పేరిట ఐదు రోజుల పాటు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో వివిధ అంశాలపై నిపుణుల చేత ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటన ద్వారా సూచించారు. సమగ్ర శిక్షా […]
* Put on the Red List the staff who have not rendered services properly ** District Collector A. Suryakumari during the inspection of Vasantha Vihar Secretariat
Published on: 19/05/2022*సేవలు సరిగ్గా అందించని సిబ్బందిని రెడ్ లిస్టులో పెట్టండి* *వసంత విహార్ సచివాలయ తనిఖీలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *సమయానికి రాని సిబ్బందిపై, అక్కడందుతున్న సేవలపై కలెక్టర్ అసహనం విజయనగరం, మే 18 ః సచివాలయానికి సమయానికి రాకుండా… ప్రజలకు సంతృప్తికర సేవలందించకుండా నిర్లక్ష్యం వహించే సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను రెడ్ లిస్టులో పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని వసంత విహార్ సచివాలయాన్ని ఆమె బుధవారం ఉదయం […]
Joint Collector Mayur Ashok inspected the ration shop
Published on: 18/05/2022రేషన్ షాప్ ని తనిఖీ చేసిన జెసి మయూర్ అశోక్ భోగాపురం మండలం సవరవిల్లి రేషన్ షాపు ను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ సరుకుల నాణ్యతను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. సరుకుల సరఫరాపై ఆరా తీశారు. డిపోలో విద్యుత్ సరఫరా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో మండల తాసిల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
New checklist for secretariat checks, District Collector Surya Kumari
Published on: 18/05/2022సచివాలయ తనిఖీలకు కొత్త చెక్ లిస్ట్ కౌమార బాలికలకు అవగాహన కోసం సఖి గ్రూప్ ప్రసవించేవరకూ గర్భిణీల మానిటరింగ్ వేసవి సెలవుల్లో పిల్లలకు రీడింగ్ హెబిట్ కోసం స్టోరీ పుస్తకాలు జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, మే 17:: మండల ప్రత్యేకధికారులు, జిల్లా అధికారుల సచివాలయాల తనిఖీలలో పరిశీలించిన అంశాలను నమోదు చేయడానికి కొత్త ఫార్మాట్ ను రూపొందించినట్లు జిల్లా కలెక్టరు సూర్య కుమారి తెలిపారు. ఇక పై నూతన ప్రొఫార్మా లొనే అప్లోడ్ చేయాలని […]