News

Filter by:
146 requests for response, District Collector Suryakumari

146 requests for response, District Collector Suryakumari

Published on: 09/05/2022

స్పందనకు 146 వినతులు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఏప్రిల్  09::  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 146 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 21 డి.ఆర్.డి.ఏ కు 09 అందగా  రెవిన్యూ కు సంబంధించి 116 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టరు పద్మావతి, డి.ఆర్.డి.ఏ పి.డి డా.అశోక్ కుమార్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ ఏ ఒక్క స్పందన […]

District Collector who inspected the Inter Examination Centers

District Collector who inspected the Inter Examination Centers

Published on: 09/05/2022

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, మే 09 : న‌గ‌రంలోని ప‌లు ఇంట‌ర్మీడియెట్ ప‌రీక్షా కేంద్రాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎం.సూర్య‌కుమారి సోమ‌వారం తనిఖీ చేశారు. శ్రీ‌నివాస జూనియ‌ర్ క‌ళాశాల‌, ఎం.ఎస్‌.ఎన్‌.జూనియ‌ర్ క‌ళాశాల త‌దిత‌ర ప‌రీక్షా కేంద్రాలను సంద‌ర్శించి ప్రైవేటు క‌ళాశాల‌ల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తీరును ప‌రిశీలించారు. ప‌లు గ‌దుల్లో విద్యార్ధులు ప‌రీక్ష రాస్తున్న విధానం, వారికి క‌ల్పిస్తున్న వ‌స‌తుల‌ను తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధుల హాజ‌రుపై ప‌రీక్ష కేంద్రాల సూప‌రింటెండెంట్‌ల‌తో మాట్లాడారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప‌ట్ల క‌లెక్ట‌ర్ […]

* Stay alert for storm surges * Make sure there are no interruptions in the conduct of inter-tests * Directions by District Collector A. Suryakumari in response review

* Stay alert for storm surges * Make sure there are no interruptions in the conduct of inter-tests * Directions by District Collector A. Suryakumari in response review

Published on: 09/05/2022

*అస‌ని తుఫాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి* *ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఆటంకం లేకుండా చూసుకోండి *స్పంద‌న సమీక్ష‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశాలు విజ‌య‌న‌గ‌రం, మే 09 ః అస‌ని తుఫాను హెచ్చ‌రికల నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. తుఫాను ప్ర‌భావం వ‌ల్ల‌ ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి […]

State Education Minister Botsa Satyanarayana unveiled the statue of Alluri Sitaramaraj, a veteran and freedom fighter.

State Education Minister Botsa Satyanarayana unveiled the statue of Alluri Sitaramaraj, a veteran and freedom fighter.

Published on: 09/05/2022

*అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి బొత్స‌* *అల్లూరి సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో దాస‌న్న‌పేట కూడ‌లిలో ఏర్పాటు *భాగ‌స్వామ్య‌మైన ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు విజ‌య‌న‌గ‌రం, మే 07 ః మ‌న్యంవీరుడు, స్వాతంత్య్ర పోరాట స‌మ‌రయోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆవిష్క‌రించారు. ఆయ‌న వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక దాస‌న్నపేట రైతు బ‌జార్ కూడలిలో క్ష‌త్రియ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని మంత్రి బొత్స‌, స్థానిక ఎమ్మెల్యే […]

Collector who inspected the Inter Test Centers

Collector who inspected the Inter Test Centers

Published on: 06/05/2022

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ గ‌రివిడి, గుర్ల (విజ‌య‌న‌గ‌రం), మే 06 ః   ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మతి ఎ.సూర్య‌కుమారి త‌నిఖీ చేశారు. గ‌రివిడిలోని శ్రీ‌రామా జూనియ‌ర్ క‌ళాశాల‌ను, గుర్ల ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ను సంద‌ర్శించారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు శుక్రవారం నుంచే మొద‌లైన నేప‌థ్యంలో, ఆయా ప‌రీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌తి సెంట‌ర్‌లో త్రాగునీటి సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని, ప‌క‌డ్భంధీగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని, చూసిరాత‌ల‌ను నివారించాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

Invitation for admission to KGBV, acceptance of applications online from 7, applications for 7th, 8th and 7th vacant seats, District Collector A. Suryakumari

Invitation for admission to KGBV, acceptance of applications online from 7, applications for 7th, 8th and 7th vacant seats, District Collector A. Suryakumari

Published on: 06/05/2022

కెజిబివిల్లో ప్రవేశాలకు ఆహ్వానం 7 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ 6వ తరగతితో పాటు 7,8 ఖాళీ సీట్లకు కూడా దరఖాస్తులు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, మే 06 ః   క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాల్లో 6,7,8 త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు అర్హ‌త గ‌ల వారినుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా స‌మ‌గ్ర శిక్ష ఛైర్మ‌న్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కెజిబివిల్లో ప్రవేశాల కొరకు, అర్హులైన విద్యార్ధినులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ […]

District Collector Smt. A. Suryakumari on Thursday inspected the conduct of the Tenth examinations in the district.

District Collector Smt. A. Suryakumari on Thursday inspected the conduct of the Tenth examinations in the district.

Published on: 06/05/2022

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ న‌గ‌రంలోనూ, డెంకాడ‌లో త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, మే 05 :  జిల్లాలో జ‌రుగుతున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి గురువారం ప‌రిశీలించారు. న‌గ‌రంలోని సెయింట్ ఆన్స్ బాలికోన్న‌త పాఠ‌శాల‌, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ల‌ను, డెంకాడ మండ‌లం జొన్నాడ‌లోని జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ప‌రీక్ష కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ త‌నిఖీచేసి ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న తీరును తెలుసుకున్నారు. ప‌రీక్ష రాస్తున్న విద్యార్ధుల‌కు త‌గిన సౌక‌ర్యాలు క‌ల్పించిన‌దీ లేనిదీ ప‌రిశీలించారు. ఆయా కేంద్రాల్లో […]

MIG layouts at affordable prices, 20% rebate for government employees, pensioners, clear title for disputes, must be applied for by the 27th of this month, District Collector Surya Kumari

MIG layouts at affordable prices, 20% rebate for government employees, pensioners, clear title for disputes, must be applied for by the 27th of this month, District Collector Surya Kumari

Published on: 06/05/2022

    సరసమైన ధరలకు  ఎం.ఐ.జి లే ఔట్లు ప్రభుత్వ ఉద్యోగులకు, పించన్ దారులకు 20 శాతం రిబేట్ వివాదాలకు తావులేని క్లియర్ టైటిల్ ఈ నెల 27 లోగా దరఖాస్తు చేసుకోవాలి                                                                                         జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 05 :  మధ్యతరగతి ఆదాయ ప్రజలకు సొంతింటి కల సాకారం చేసేందుకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్  పధకం లో భాగంగా  విజయనగరం జిల్లాలో  డి.టి.సి.పి వారిచే అమోదించబడిన లే ఔట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా […]

Focus on Unresolved Issues * District Collector A. Suryakumari at Division Level Review Meeting * Warning that memos should not be issued if the performance is not good.

Focus on Unresolved Issues * District Collector A. Suryakumari at Division Level Review Meeting * Warning that memos should not be issued if the performance is not good.

Published on: 05/05/2022

అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌పై దృష్టి కేంద్రీక‌రించండి *డివిజ‌న్ స్థాయి స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి *ప‌ని తీరు బాగుండ‌క‌పోతే మెమోలు జారీ చేయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌ విజ‌య‌న‌గ‌రం, మే 04 ః జిల్లాలో వివిధ ప‌నుల‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స‌మస్య‌లపై దృష్టి కేంద్రీక‌రించాల‌ని, ప‌రిష్కారానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టంలో విఫ‌ల‌మైన వారికి మెమోలు జారీ చేయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. స్థానిక క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఆమె విజ‌య‌న‌గ‌రం […]

This is a good time to build a house. If construction does not start, it will be canceled. Volunteers with low attendance should be removed. District Collector A. Suryakumari

This is a good time to build a house. If construction does not start, it will be canceled. Volunteers with low attendance should be removed. District Collector A. Suryakumari

Published on: 05/05/2022

ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి ఇదే త‌గిన స‌మ‌యం నిర్మాణం ప్రారంభించ‌క‌పోతే ర‌ద్దు చేస్తాం హాజ‌రు త‌క్కువ‌గా ఉన్న వ‌లంటీర్ల‌ను తొల‌గించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి చీపురుప‌ల్లి, గ‌రివిడి, గుర్ల మండ‌లాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌ చీపురుపల్లి, గ‌రివిడి, గుర్ల‌, (విజ‌య‌న‌గ‌రం), మే 04 ః  ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి పేద‌ల‌కు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని, ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాన్నివెంట‌నే ప్రారంభించ‌క‌పోతే ర‌ద్దు చేస్తామ‌ని, అలాంటివారికి మ‌రోసారి ఇళ్లు మంజూరు కాద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీఒక్క‌రూ ఆల‌స్యం చేయ‌కుండా, నిర్మాణాన్నిప్రారంభించాల‌ని […]