News
District Collector A. Suryakumari oversaw the arrangements for the visit of Union Health and Family Welfare Minister Mansukh Mandaviya.
Published on: 25/04/2022కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ సచివాలయాలు, పాఠశాలలు తనిఖీ విజయనగరం, ఏప్రెల్ 23 ః. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటనా ఏర్పాట్లను, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పర్యవేక్షించారు. ఆమె శనివారం పూసపాటిరేగ, నెల్లిమర్ల, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 26న కేంద్రమంత్రి పాల్గొననున్న కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్ ముందుగా కుమిలిలోని గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది పనితీరును పరిశీలించారు. […]
Union Health and Family Welfare Minister Dr Mansukh Mandavia will visit the district on the 26th of this month. District Collector A. Suryakumari asked them to make arrangements for the tour and make it a success.
Published on: 23/04/2022ఈనెల 26న కేంద్రమంత్రి మన్సుఖ్ జిల్లా పర్యటన పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలి ః కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఏప్రెల్ 22 ః కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ నెల 26వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. […]
Special Gram Sabhas for crop loans from 24th of this month to 1st of May, District Collector Surya Kumari
Published on: 23/04/2022👉 ఈ నెల 24 నుండి మే 1 వరకూ పంట రుణాల ప్రత్యేక గ్రామ సభలు 👉జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, ఏప్రిల్ 22:: కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంతవరకు పంటరుణాలు పొందని రైతులకోసం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ గ్రామ సభలు ఈ నెల 24 నుండి మే నెల 1 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో […]
Memos to Secretariat staff not arriving on time, Collector who randomly inspected the Secretariat
Published on: 22/04/2022వేళకు రాని సచివాలయ సిబ్బందికి మెమోలు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, ఏప్రెల్ 22 ః సమయ పాలన పాటించని సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని అలకానంద కాలనీ 47వ వార్డు సచివాలయాన్ని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఉదయం 9.55 […]
Healthy Society is the objective of the government, District Parish Chairperson Majji Srinivasa Rao & Collector Smt. A.Surya Kumari, Health Mela at the District Central Hospital
Published on: 22/04/2022ఆరోగ్యవంతమైన సమాజమే ప్రభుత్వ లక్ష్యం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా కేంద్రాసుపత్రిలో ఆరోగ్యమేళా విజయనగరం, ఏప్రెల్ 22 ః ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అందుకే వైద్య రంగానికి మన ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం క్రింద జిల్లా కేంద్రాసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన […]
Dist collecter attended ajadika amruth vutsav rally
Published on: 22/04/2022Tenth class examinations should be conducted as a bandwagon, Education Minister Botsa Satyanarayana instructed the District Collectors, video conferencing with the Collectors and DEOs.
Published on: 22/04/2022పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు కలెక్టర్‌లు, డి.ఇ.ఓ.లతో వీడియో కాన్ఫరెన్స్ విజయనగరం, ఏప్రిల్ 21 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా సజావుగా పరీక్షలను నిర్వహించేందుకు తగిన విధంగా సన్నద్ధత వుండాలన్నారు. ముఖ్యంగా వేసవి […]
The focus should be on resolving revenue-related grievances, CCLA said. Video Conference with Special Principal Secretary, Saiprasad, District Collectors, JCs
Published on: 22/04/2022రెవిన్యూకు సంబంధించిన స్పందన వినతుల పరిష్కారంపై దృష్టి సారించాలి సి.సి.ఎల్.ఏ. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్‌లు, జె.సి.లతో వీడియో కాన్ఫరెన్స్ విజయనగరం, ఏప్రిల్ 21 : జిల్లాల్లో ప్రజల నుంచి రెవిన్యూశాఖకు సంబంధించి స్పందనలో వచ్చే వినతుల పరిష్కారంపై అధికంగా శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్‌లకు సి.సి.ఎల్.ఏ. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సూచించారు. స్పందనలో అందే వినతుల్లో 60 నుంచి 70 శాతం వరకు రెవిన్యూశాఖకు సంబంధించినవే వుంటున్నాయని, వాటిని […]
Do not step on – Do not spoil lives, Collector Surya Kumari at an awareness seminar on child marriages and social issues
Published on: 21/04/2022👉తప్పటడుగులు వేయవద్దు- జీవితాలు పాడు చేసుకోవద్దు 👉బాల్య వివాహాలు, సామాజిక సమస్యల పై అవగాహనా సదస్సు లో కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఏప్రిల్ 20:: బాలికలు కౌమార దశ నుండి యవ్వనం లోకి అడుగుపెడుతున్న తరుణం లో తొందరపడి తప్పటడుగులు వేసి జీవితాలను పాడు చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి హితవు పలికారు. ఈ వయసు లో ఒక సారి తప్పు జరిగితే సరిదిద్దుకోలేరని, అందువల్ల జీవితాలు పాడవుతాయని అన్నారు. బుధవారం కలెక్టరేట్ […]
Another step towards farmer welfare, six-day crops in 25,000 acres in Kharif, District Collector Suryakumari’s innovative initiative, online meeting with Icrisat scientists
Published on: 20/04/2022రైతు శ్రేయస్సే లక్ష్యంగా మరో ముందడుగు ఖరీఫ్‌లో వరికి బదులు 25వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వినూత్న ప్రయత్నం ఇక్రిశాట్ సైంటిస్టులతో ఆన్‌లైన్లో భేటీ త్వరలో జిల్లాకు శాస్తవ్రేత్తల బృందం విజయనగరం, ఏప్రెల్ 20 ః రైతుల శ్రేయస్సే ధ్యేయంగా, పంటలకు తగిన గిట్టుబాటు ధరను కల్పించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పంటలకు బదులు, వ్యవసాయాన్ని లాభసాటి చేసే పంటల విధానానికి శ్రీకారం చుడుతున్నారు. […]