News

Filter by:
District Collector A. Surya Kumari directed that in addition to providing quality nutritious food at Anganwadi Centers, weight and height should also be recorded accurately.

District Collector A. Surya Kumari directed that in addition to providing quality nutritious food at Anganwadi Centers, weight and height should also be recorded accurately.

Published on: 18/12/2021

అంగన్వాడీ కేంద్రాలలో  బరువు తూకం  ఖచ్చితంగా ఉండాలి ఫోర్టిఫైడ్ రైస్ పై అవగాహన ఉండాలి కొత్తవలస లో అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, డిసెంబర్ 17::: అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన  పౌష్టికాహారాన్ని  అందించడం తో పాటు బరువు, ఎత్తులు కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  కొత్తవలస  మండలం  వియ్యంపేట, తుమ్మకపల్లి అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లల హాజరు పట్టిక పరిశీలించారు. వియ్యంపేట లో 10 మంది పిల్లలకు గాను 9 మంది […]

Distribution of TLM kits to children with special needs at the call of District Collector A. Suryakumari

Distribution of TLM kits to children with special needs at the call of District Collector A. Suryakumari

Published on: 14/12/2021

దివ్యాంగుల‌కు చ‌క్క‌ని భ‌విష్య‌త్తునిద్దాం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపు ప్ర‌త్యేక అవ‌స‌రాల పిల్ల‌ల‌కు టిఎల్ఎం కిట్లు పంపిణీ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 14 ః పిల్ల‌ల్లో విక‌లాంగ‌త్వం ఉంద‌ని బాధ‌ప‌డ‌వ‌ద్ద‌ని, వారికి మంచి భ‌విష్య‌త్తునిచ్చేందుకు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. దివ్యాంగుల అభివృద్దికి ప్ర‌భుత్వం ఎన్నో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంద‌ని, వాటిని వినియోగించుకోవాల‌ని సూచించారు. ప్ర‌త్యేక అవ‌స‌రాల పిల్ల‌ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో టీచింగ్‌, లెర్నింగ్ మెటీరియ‌ల్ కిట్ల‌ను మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ పంపిణీ చేశారు. ఒక్కొక్క‌టి సుమారు రూ.10వేలు విలువ‌చేసే 162 కిట్ల‌ను ఎన్ఐఇపిఐడి (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ […]

* Everyone should be vigilant about Covid Thirdwave * Collector Suryakumari who met exclusively with District Officers

* Everyone should be vigilant about Covid Thirdwave * Collector Suryakumari who met exclusively with District Officers

Published on: 14/12/2021

*త‌స్మాత్ జాగ్ర‌త్త‌* * కోవిడ్ థ‌ర్డ‌వేవ్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి * జిల్లా అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి * ఒమిక్రాన్ కేసులు లేవు… ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దని సూచ‌న‌ * బ‌య‌ట ప్రాంతాల నుంచి వ్య‌క్తుల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచాల‌ని ఆదేశాలు విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 13 ః కోవిడ్ థ‌ర్డ్‌వేవ్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను హెచ్చ‌రించారు. ఐర్లాండ్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి ఒమిక్రాన్ సోకింద‌న్న నేప‌థ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ‌, ఇత‌ర అధికారులతో ఆమె సోమ‌వారం […]

Funds sanctioned for housing scheme for the poor, Rs 30.65 crore credited to personal accounts, District Collector A. Suryakumari

Funds sanctioned for housing scheme for the poor, Rs 30.65 crore credited to personal accounts, District Collector A. Suryakumari

Published on: 14/12/2021

పేదలందరికీ ఇళ్ళు పధకానికి నిధులు మంజూరు            రూ.30.65 కోట్ల వ్యక్తిగత ఖాతాలకు జమ                        జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి విజయనగరం,  డిసెంబర్ 13:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  తీసుకున నవరత్నాలు లో భాగంగా పేదలందకీ  ఇళ్లు కార్యక్రమం ఎన్.పి.ఐ. (నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు) లో భాగంగా ఇంతవరకు సుమారుగా 22,921 మంది లబ్దిదారులకు 100.71 కోట్లు పేపెమెంట్ జనరేట్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.     95 లక్షలు విలువ చేసే సిమెంట్, స్టీలు లబ్దిదారులకు ఇవ్వడం ఇరిగిందని,   ప్రస్తుతం  ప్రభుత్వం 5133 లబ్దిదారులకు 30,65,87,322 (రూ. 30.65 కోట్లు) తమ వ్యక్తిగత ఖాతా నందు జమచేయడం జరిగిందని వివరించారు.   మిగతారావలసిన 69 కోట్లు కూడా వారం రోజులలో జమచేయడం జరుగుతుందన్నారు.   సిమెంట్, స్టీల్ అన్ని గొడాములో నిండుగా ఉన్నవని,    పేమెంట్స్ కూడా అకౌంట్స్ లో పడుతున్నాయి   కావున లబ్దిదారులు త్వరగా ఇళ్లు నిర్మాణాలు చేపట్టి స్లాబులు పూర్తి చేయాలని ఆ ప్రకటనలో కోరారు.

No worries ... there is no Omicron positive case in the district at present, Covid rules have to be complied with District Collector Surya Kumari

No worries … there is no Omicron positive case in the district at present, Covid rules have to be complied with District Collector Surya Kumari

Published on: 13/12/2021

ఆందోళన వద్దు… జిల్లాలో  ఒమైక్రాన్ పోజిటివ్  కేస్ ప్రస్తుతం  లేదు కోవిడ్ నిబంధనలు పాటించాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, డిసెంబర్ 12::::జిల్లాలో.  ఒమి క్రాన్ పాజిటివ్ ప్రస్తుతం లేదని, ఎవ్వరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు.  ఎస్. కోట మండలం బొద్దాం పి.హెచ్.సి. పరిధిలోని వీర నారాయణం గ్రామానికి ఐర్లాండ్ నుంచి ఈ నెల 5న ఒక వ్యక్తి వచ్చారని, […]

* Collector praises District Authority * Officers and staff who played a key role in the vaccination process

* Collector praises District Authority * Officers and staff who played a key role in the vaccination process

Published on: 13/12/2021

*జిల్లా అధికార బృందానికి క‌లెక్ట‌ర్ ప్ర‌శంస‌లు* * వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కీల‌క‌పాత్ర పోషించిన‌ అధికారులు, సిబ్బంది విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 11 ః జిల్లాలో చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఆశాజ‌నకంగా సాగినందుకు క‌లెక్టర్ ఎ. సూర్య‌కుమారి జిల్లా అధికార బృందానికి అభినంద‌న‌లు తెలిపారు. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని త‌క్కువ కాలంలోనే నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకున్నార‌ని కొనియాడారు. వైద్య సిబ్బంది, అధికారులు, స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు ఎంతో శ్ర‌మించి జిల్లాలో 96.7 శాతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి […]

Covid Rules Everybody has to abide by and wear a mask, says District Collector Smt. A.Suryakumari

Covid Rules Everybody has to abide by and wear a mask, says District Collector Smt. A.Suryakumari

Published on: 10/12/2021

కోవిడ్ నిబంధ‌న‌లు ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల్సిందే మాస్కు ధ‌రించాల్సిందే మూడో ద‌శ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి కోవిడ్ స‌న్న‌ద్ధ‌త‌పై స‌మావేశం విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 09; మూడో ద‌శ కోవిడ్ ముప్పును ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య యంత్రాంగం స‌న్న‌ద్ధంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఒమిక్రాన్ రూపంలో కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి వుంద‌న్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్కు ధ‌రించ‌డం, భౌతిక దూరం […]

Malnutrition in children should be prevented, says Collector Surya Kumari at Nithiyogi meeting

Malnutrition in children should be prevented, says Collector Surya Kumari at Nithiyogi meeting

Published on: 10/12/2021

పిల్ల‌ల్లో పోష‌కాహార లోపాన్ని నివారించాలి నీతిఅయోగ్ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 09 ః         పిల్ల‌ల్లో పోష‌కాహార లోపాన్ని నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ అంశాల‌పై త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం, పోష‌కాహార లోపం నివార‌ణ‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఆయా అంశాల్లో జిల్లా ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. జిల్లాలో ఆరేళ్ల లోపు పిల్ల‌లు సుమారు 1,18,726 మంది రిజిష్ట‌ర్ కాగా, వీరిలో సుమారు 2.15 శాతం మంది పోష‌కాహార లోపంతో, 1.7 శాతం […]

Create a friendly work environment, work with respect for employees who work with commitment, District Collector A. Surya Kumari

Create a friendly work environment, work with respect for employees who work with commitment, District Collector A. Surya Kumari

Published on: 09/12/2021

పని చేసేచోట స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించుకోవాలి                 నిబద్ధత తో పని చేసే ఉద్యోగులకు గౌరవం లభిస్తుంది  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం,  డిసెంబర్  09:  మహిళలు పనిచేసే చోట స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించుకోవాలని అప్పుడే ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతారని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  మహిళా ఉద్యోగులు సమష్టి గా ఉంటే వారిలో  బలం చేకూరుతుందని,  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని అన్నారు. మహిళల పై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం పై గురువారం కలక్టరేట్ ఆడిటోరియం లో   […]

Land registration services in two villages, secretariats to make arrangements to start --J.C. Dr. Kishore Kumar

Land registration services in two villages, secretariats to make arrangements to start –J.C. Dr. Kishore Kumar

Published on: 09/12/2021

రెండు గ్రామ స‌చివాల‌యాల్లో భూముల రిజిస్ట్రేష‌న్ సేవ‌లు ప్రారంభించే ఏర్పాట్లు చేయాల‌న్న‌ జె.సి. డా.కిషోర్ కుమార్‌ లాండ్ పార్శిల్ వారీగా భూముల‌ మార్కెట్ ధ‌ర‌లు నిర్ధార‌ణ‌ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 09; జిల్లాలోని రెండు గ్రామ స‌చివాల‌యాల్లో తొలి ద‌శ‌లో భూముల రిజిస్ట్రేష‌న్ సేవ‌లు అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జాయింట్ క‌లెక్టర్(రెవిన్యూ, రైతుభ‌రోసా) డా.జి.సి.కిషోర్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో వై.ఎస్‌.ఆర్‌., జ‌గ‌న‌న్న శాశ్వత భూహ‌క్కు, భూర‌క్ష కార్యక్రమంలో చేప‌ట్టిన భూముల స‌మ‌గ్ర రీస‌ర్వే తొలి విడ‌త‌గా రెండు గ్రామాల్లో పూర్తయ్యింద‌ని ఆ రెండు గ్రామాల్లో భూముల […]