News
District Collector A. Suryakumari will be inspecting government lands in New Wales & Greenfield Highway Land Acquisition Complete by the end of the month
Published on: 09/12/2021నెలాఖరులోగా గ్రీన్‌ఫీల్డు హైవే భూసేకరణ పూర్తి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కొత్తవలసలో ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ విజయనగరం, డిసెంబరు 08 ః ఈ నెలాఖరులోగా విశాఖపట్నం-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డు హైవే భూసేకరణను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. ఇప్పటికే మూడు ప్యాకేజీలు దాదాపు పూర్తయ్యాయని, చివరి ప్యాకేజీ భూసేకరణ జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కొత్తవలస మండలంలో కలెక్టర్ సూర్యకుమారి బుధవారం విస్తృతంగా పర్యటించారు. అర్ధానపాలెం, రెల్లి, బలిఘట్టంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆమె […]
Accelerate National Highway Land Acquisition * Land should be handed over to the owner within the stipulated time * Collector A. Suryakumari directed the officers in the review
Published on: 08/12/2021జాతీయ రహదారి భూ సేకరణలో వేగం పెంచాలి * నిర్ణీత గడువులోగా యాజమాన్యానికి భూమి అప్పగించాలి * సమీక్షలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, డిసెంబర్ 08 ః విశాఖపట్టణం – రాయ్‌పూర్ ఎన్.హెచ్. 130 సీడీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా సంబంధిత యాజమాన్యానికి భూమి అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. జేసీ కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఆర్డీవో భవానీ శంకర్, ఎన్‌హెచ్ఎఐ ప్రతినిధులతో బుధవారం ఆమె తన […]
* Better results should be obtained in OTS * * Collector Suryakumari in Boppadam Secretariat Inspection * Collector dissatisfied with the management of dumping yards
Published on: 07/12/2021*ఓటీఎస్‌లో మెరుగైన ఫలితాలు రాబట్టాలి* *బొప్పడాం సచివాలయ తనిఖీలో కలెక్టర్ సూర్యకుమారి *డంపింగ్ యార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ విజయనగరం, డిసెంబర్ 07 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత గృహ హక్కు (ఓటీఎస్- ఒన్ టైం సెటిల్‌మెంట్) పథకంలో మెరుగైన ఫలితాలు సాధించాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూర్యకుమారి సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం ఆమె నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, అధికారులు ఎల్లప్పుడూ […]
* Soldiers’ Sacrifices Immortal * * Collector Suryakumari at the Armed Forces Flag Day Celebration
Published on: 07/12/2021*సైనికుల త్యాగాలు అజరామరం* *సాయుధ దళాల పతాక దినోత్సవ సభలో కలెక్టర్ సూర్యకుమారి *యుద్ధవీరులకు సత్కారం చేయటం నా అదృష్టం అని వ్యాఖ్య విజయనగరం, డిసెంబర్ 07 ః దేశ రక్షణలో నిమగ్నమై ఎన్నో త్యాగాలను చేస్తున్న సైనికుల జీవితాలు, వారందిస్తున్న సేవలు అజరామరమని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కీర్తించారు. యుద్ధవీరులకు నా చేతుల మీదుగా సత్కారం జరగటం నిజంగా నా అదృష్టమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన […]
* OTS is not aimed at collecting money * * District Collector A. Suryakumari at the review meeting
Published on: 07/12/2021*డబ్బులు వసూలు చేయటం ఓటీఎస్ లక్ష్యం కాదు* * లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనాలు చేకూర్చటం ప్రధాన ఉద్దేశం * సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి * సానుకూల దృక్పథం కల్పించాలని అధికారులకు ఆదేశాలు * రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని సూచన విజయనగరం, డిసెంబర్ 06 ః డబ్బులు వసూలు చేయటం ఓటీఎస్ (ఒన్ టైం సెటిల్మెంట్) పథకం లక్ష్యం కాదని.. లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనాలు కల్పించటమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సానుకూల దృక్పథం కల్పించాల్సిన బాధ్యత ప్రతి […]
* Do not go hunting … Do not harvest rice .. * * Collector A. Suryankumari appealed to fishermen and farmers.
Published on: 03/12/2021*వేటకు వెళ్లొద్దు… వరి కోతలు కోయొద్దు..* * మత్స్యకారులకు, రైతులకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి * తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలో సుడిగాలి పర్యటన * అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్ షెల్టర్లలో ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచన * సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో అధికారులకు సహకరించాలని ప్రజలకు మనవి విజయనగరం, డిసెంబర్ 02 ః జావెద్ తుఫాను ప్రమాదం పొంచి ఉందని, అధికారులు, ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి హెచ్చరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. […]
Due to low pressure in the Bay of Bengal, there is a possibility of heavy rains in the district from the 3rd of this month. Was alarmed. Control rooms have been set up in all zones as per the directions of Collector Mrs. A. Suryakumari.
Published on: 03/12/2021బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా, ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశాలమేరకు అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా కంట్రోల్ రూముల నెంబర్లు ః- విజయనగరం ఆర్‌డిఓ ఆఫీస్ ః 8922276888 భోగాపురం ః 8074400947 బొండపల్లి ః 9494340170 చీపురుపల్లి ః 9951520101 దత్తిరాజేరు ః 6303131206 డెంకాడ ః 9490036688 గజపతినగరం ః 9963456373 గంట్యాడ ః 9440178300 గరివిడి ః 9391626256 గుర్ల ః 8639657970 జామి […]
Be alert for storm surges, chance of heavy rains from 3am, farmers’ hardship should not be wasted, all precautionary measures should be taken, Collector Suryakumari in video conference
Published on: 03/12/2021తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి 3 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రైతుల కష్టం వృధా కాకూడదు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ చేపట్టాలి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, డిసెంబరు 01 ః బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అప్రమత్తం చేశారు. ఈ అల్పపీడనం […]
Special meeting with representatives of the Chamber of Commerce and officials at the Collectorate
Published on: 03/12/2021*మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం* * ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం * సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు * ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్‌లో ప్రత్యేక భేటీ జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రక్రియను వేగవంతం చేయాలని, సంబంధిత సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను అనుసరిస్తూ […]
District Collector A. Surya Kumari has directed the Department of Adult Education to ensure proper literacy program for the illiterate.
Published on: 03/12/2021నిరక్షరాస్యు లైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి పడనా లిఖనా కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి వయోజన విద్యా శాఖ ద్వారా నిరక్షరాష్యులను అక్షరాస్యులుగా చేసే పడనా లిఖనా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. జిల్లాలో ఎంపిక చేసిన 10 మండలాల నుండి 15 నుండి 50 స0వ త్సరాల మధ్య గల 46 వేల మందిని ఈ కార్యక్రమానికి గుర్తించినట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పడనా […]